ఆల్మోస్ట్ విడుదలైన ఏడాదికి `పుష్ప` మరో దేశంలో రిలీజ్‌ కాబోతుంది. రష్యాలోని ఈసినిమాని గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఇటీవల ట్రైలర్‌ ని కూడా రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) నటించిన `పుష్ప`(Pushpa) ఇండియాలో భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈసినిమాకి మొదట మిశ్రమ స్పందన లభించింది. ల్యాగ్‌ ఉందని, నిడివి ఎక్కువ ఉందని అన్నారు. కానీ కంటెంట్‌కి అదేదీ సమస్య కాదని సినిమా నిరూపించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. హిందీలోనే ఏకంగా సుమారు 90కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రూ.350కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను, సినిమా యూనిట్‌ని షాక్‌కి గురి చేసింది. 

ఆల్మోస్ట్ విడుదలైన ఏడాదికి ఈ చిత్రం మరో దేశంలో రిలీజ్‌ కాబోతుంది. రష్యాలోని ఈసినిమాని గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఇటీవల ట్రైలర్‌ ని కూడా రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. దానికి మంచిస్పందన లభించింది. డిసెంబర్‌ 8న రష్యాని `పుష్ప` విడుదలకాబోతున్న నేపథ్యంలో అక్కడ ప్రమోషన్‌ కార్యక్రమాలు చేయబోతుంది టీమ్‌. అందుకు `పుష్ప` టీమ్‌ రష్యాకి చేరుకుంది. అల్లు అర్జున్‌, హీరోయిన్‌ రష్మిక మందన్నా(Rashmika Mandanna), దర్శకుడు సుకుమార్‌, సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్‌, నిర్మాత రవిశంకర్‌ రష్యాలో అడుగుపెట్టారు. 

రష్యాలో వీరికి గ్రాండ్‌ వెల్‌కమ్‌ దక్కింది. అక్కడ `పుష్ప`ని విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు వీరికి స్వాగతం పలికారు. తాజాగా ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్టయిలీష్‌లుక్‌లో ఎప్పటిలాగే అదరగొట్టేలా ఉన్నారు బన్నీ. రేపు డిసెంబర్‌ 1న మాస్కోలో, డిసెంబర్‌ 3న సెయింట్‌ పీటర్స్ బర్గ్ లో `పుష్ప` ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నారు. ఇందులో ఈ టీమ్‌ పాల్గొనబోతుంది. మరోవైపు పలు ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనూ పాల్గొనబోతున్నారని సమాచారం. 

Scroll to load tweet…

ప్రస్తుతం `పుష్ప 2` షూటింగ్‌ జరుగుతుంది. హైదరాబాద్‌ శివారులో ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి `పుష్ప` ప్రమోషన్‌లో పాల్గొనబోతుంది టీమ్‌. రెండో పార్ట్ ని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. ఇందులో బన్నీ, రష్మికతోపాటు మలయాళ హీరో ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తుండగా, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు రెండో పార్ట్ లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ యాడ్‌ కాబోతున్నట్టు సమాచారం.