మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుండగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్, సింగిల్స్, పోస్టర్స్, గెటప్స్ ఇలా ఒక్కటి అని కాకుండా ప్రతిదీ ప్రేక్షకులను, అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.



అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో ఇప్పటివరకూ రెండు సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్న మూడో సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుండగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్, సింగిల్స్, పోస్టర్స్, గెటప్స్ ఇలా ఒక్కటి అని కాకుండా ప్రతిదీ ప్రేక్షకులను, అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.

ఈ నేపధ్యంలో “పుష్ప: ది రైజ్” ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ‘పుష్ప’ మేకర్స్ ట్రైలర్ విడుదల తేదీని ఖరారు చేస్తూ అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ప్రత్యేక పోస్టర్ తో ‘పుష్ప’ ట్రైలర్ అప్డేట్ ను అనౌన్స్ చేశారు. ఆ పోస్టర్ లో అల్లు అర్జున్ ‘తగ్గేదే లే’ అన్నట్లుగా కన్పించగా, డిసెంబర్ 6న ట్రైలర్ విడుదల కానుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 6 నుంచి వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. దీంతో బన్నీ అభిమానులు ‘తగ్గేదే లే’ అంటూ సోషల్ మీడియాలో #అల్లుఅర్జున్, #పుష్ప ది రైజ్ ట్రైలర్ అనే హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు.

Scroll to load tweet…

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో చిత్తూరు జిల్లాలో సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా ఆధారంగా “పుష్ప” తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సమంత ప్రత్యేక గీతంలో కనిపించనుంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ విలన్లుగా, అనసూయ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ 2 భాగాల యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నాయి. 

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా…ఇక ఈసినిమాలో ఫహాద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ గా, రష్మిక శ్రీ వల్లి గా, సునీల్ మంగళం శ్రీనుగా అనసూయ దాక్షాయణి గా కనిపించనున్నారు.