ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప2, పుష్ప ద రూల్ టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమా.. పుప్ప సినిమాకు రీమేక్. ఈ సినిమా నుంచి ఓ భారీ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అల్లు అర్జున పుష్ప2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ? ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని వెయ్యికళ్ళతో ఎదురు చూస్తుంది పాన్ ఇండియా. అలా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు పుష్ప స్పెషల్ లుక్ తో క్యూరియాసిటీ ఇంకా పెంచేశాడు సుకుమార్. అమ్మవారి గెటప్ లో బన్నీని చూసి షాక్ అయ్యారు అభిమానులు. ఇదేంటి ఇది.. అసలు ఏం జరుగుతుంది అర్ధం కాక కన్ ఫ్యూజన్ లో పడిపోయారు. ఫస్ట్ లుక్ చూస్తే.. ఈసారి భారీస్థాయిలోనే సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. పుష్ప ద రూల్ పై అంచనాలు కూడా ఆ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. 

ఇక ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇంత ఫాస్ట్ గా జరుగుతుంది కదా.. సినిమా రిలీజ్ కూడా ఈ ఏడాదిలో... అది కూడా అతి దగ్గరలో ఉంటుంది అనుకున్నారు ఆడియన్స్.. కాని సినిమా రిలీజ్ పై సోషల్ మీడియాలో లీకుల పర్వం నడుస్తోంది. పుఫ్ప 2 రిలీజ్ పై షాకింగ్ అప్ డేట్ నెట్టింట వైరల్అవుతోంది. ఈమూవీని వచ్చే ఏడాది రిలజ్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. పుష్ప ద రూల్ ను నెక్ట్ ఇయర్ సమ్మర్ కు అది కూడా అల్లు అర్జున్ నెక్ట్స్ బర్త్ డే సందర్భంగా 2024 ఏప్రిల్ 07 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఉండటం కాదు.. దాదాపుఫిక్స్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. 

ఈ డేట్ నిర్మాతల పరిశీలనలో ఉందట. డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ కూడా ఈ డేట్ కే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరీ చాలా లాంగ్ టైమ్ అవుతుందేమో అన్న ఆలోచనలో కూడా ఉన్నారట టీమ్. ఇక ఈసినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ మూవీ తో పాటు మ్యూజిక్ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా బన్నీకోసం అదరిపోయే ట్యూన్లు రెడీ చేస్తున్నాడట దేవిశ్రీ. 

పుష్ప సినిమాతో పస్ట్ టైమ్ పాన్ ఇండియాను టచ్ చేశాడు అల్లు అర్జున్. ఈసారి అంతకుమించి అనేలా సినిమా ఉండాలని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. పుష్ప సినిమాలో బన్నీ మ్యానరిజంతో పాటు స్టెప్స్ కూడా అతనకి అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకోచ్చాయి. బన్నీని ఇమిటేట్ చేస్తూ.. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ కూడా తెగ వీడియోలు చేశారు. ఇక వారంతా పుష్ప2 కోసం ఎదురుచూస్తున్నారు.