Pushpa Part-2 : తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్.. పుష్ప పార్ట్ 2 కూడా వచ్చేస్తోంది..?
పుష్ప పార్ట్ 1 మూవీ సూపర్ కలెక్షన్స్ తో దడదడలాడిస్తుంది. ఇక పుష్ప పార్ట్ 2 మూవీని కూడా సాధ్యమైనంత త్వరగా.. కంప్లీట్ చేయాలని టీమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నెక్ట్స్ దసరాను టార్గెట్ చేసుకుని పుష్ప పార్ట్ 2 షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారట.
ఈనెల 17న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది పుష్ప ది రైజ్. భారీ కలెక్షన్స్ తో సందడి చేస్తుంది. అల్లు అర్జున్(Allu Arjun) – రష్మిక(Rashmika) జంటగా.. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ.. పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ,కన్నడ,మలయాళ, హిందీ మార్కెట్ లో దడదడలాడిస్తుంది పుష్ప పార్ట్-1 మూవీ. స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాలు పోటీకి వచ్చినా.. తగ్గేదే లే అన్నట్టు కలెక్షన్స్ సాధిస్తుంది పుష్ప మూవీ.
పుష్ప సినిమాను రెండు పార్ట్స్ గా ప్లాన్ చేశారు. ఫస్ట్ పార్ట్ మూవీ ఎలాగు రిలీజ్ అయ్యింది. పుష్ప ది రైజ్ తో ఫస్ట్ పార్ట్ రాగా.. పుష్ప ది రూల్ పేరుతో సెకండ్ పార్ట్ ను ప్లాన్ చేశారు. ఫస్ట్ పార్ట్ మూవీ షూటింగ్ టైమ్ లోనే పార్ట్ 2 మూవీకి అవరసరమైన 20 శాతం షూటింగ్ ను కూడా పూర్తి చేశారట టీమ్. ఇక పార్ట్ 2 షూటింగ్ కూడా లేట్ చేయకుండా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట టీమ్. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి..ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే దాని గురించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ ను పిబ్రవరిలో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంద అని ఆలోచిస్తున్నారు టీమ్. పిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేసి.. ఆరు నెలల్లో కంప్లీట్ చేసుకుని.. దసరా టైమ్ కు పుష్ప ది రూల్ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట టీమ్. కాని ఇది సాధ్యం అయ్యే పనేనా అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. బన్నీ నెక్ట్స్ బోయపాటి తో మూవీ చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నాడట. మరి పుష్ప పార్ట్ 2 ను అంత తొందరగా ఎలా కంప్లీట్ చేస్తారు...?
పుష్ప పార్ట్ 1 మూవీని కంప్లీట్ చేసిన అల్లు అర్జున్.. త్వరలో బోయపాటి సినిమా సెట్స్ ఎక్కుతాడని సమాచారం. అయితే అంతకు ముందు ఓ నెల పాటు రెస్ట్ తీసుకుని పుష్ప సక్సెన్ ను ఎంజాయ్ చేయాలని చూస్తున్నాడు బన్ని. ఆ వెంటనే బోయపాటి సినిమాలో జాయిన్ అవ్వాలి అనేది ప్లాన్. అయితే ఇప్పుడు పుష్ప పార్ట్ 2 షూటింగ్ కూడా ప్లాన్ చేసుకుంటూ.. రెండు సినిమాలను సైమన్ టైనెస్ గా కంప్లీట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అల్లు అర్జున్ ఇంతకు ముందే బోయాపాటితో సరైనోడు సినిమా చేశారు. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లతో మూవీ సూపర్ సక్సస్ అయ్యింది. మరో సారి ఈ హైపర్ కాంబినేషన్ కలవబోతోంది.
Also Read : Samantha : గోవాలో రచ్చరచ్చ చేస్తున్న సమంత.. బికినీ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బోయపాటి సినిమా అంటే మంచి యాక్షన్ ట్రీట్ ఉంటుంది దాని కోసం బన్నీ డేట్స్ ఎక్కువగానే అవసరం పడతాయి. మరి అలాంటప్పుడు ఈ రెండు సినిమాలను ఒకే సారి బన్నీ ఎలా హ్యాండిల్ చేస్తాడు. ఈ విషయం పైన ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. ఒక వేళ ఒక సినిమా తరువాత మరో సినిమా చేసే అవకాశం కూడా లేకపోలేదు. అప్పుడు ముందు బన్నీ ఏ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడో చూడాలి. ఇంకా బోయపాటి తో సినిమా అనౌన్స్ మెంట్ రానేలేదు. బన్నీ ఏ ఆలోచిస్తున్నాడు అనేది తెలియాలి అంటే అనౌన్స్ మెంట్ వచ్చే దాకా ఆగాల్సిందే.