అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ మూవీ పుష్ప రికార్డ్ ల పరంపర ఆగడం లేదు. ఏదో ఒక రకంగా సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తూనే ఉంది సినిమా. రీసెంట్ గా మరో కొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది మూవీ.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన పుష్ప సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సాధించిన సక్సెస్ అంతా ఇంతా కాదు. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్ళిన బన్నీకి అక్కడ కూడా ఘనంగా స్వాగతం లభించింది పుష్ప సినిమాతో. ఈ సినిమా విజయంతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దేశమంతా అల్లు అర్జున్ పేరు మారుమోగిపోయింది.
పుష్ప మ్యానీయా మామూలుగా నడవలేదు. అటు బాలీవుడ్ సహా దక్షిణాది అంతా భారీ వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ తోనే సరిపెట్టుకోలేదు. కోట్ల మందిని ప్రభావితం చేసి సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తూనే ఉంది. నార్త్ లో పుష్ప మ్యానికా గట్టిగా నడిచింది. బన్నీని ఇమిటేడ్ చేయడం. పుష్ప పాటలను రీమిక్స్ చేయడం. పుష్ప రాజ్ క్యారెక్టర్ ను ఫాలో అవ్వడం, మ్యానరిజంతో వీడియోలుచేయడం బాగా ట్రెండ్ అయ్యాయి.
అంతే కాదు సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ తగ్గేదే లే అంటూ సందర్భానుసారం పుష్ప డైలాగ్ ను వాడుతూ తెగ హడావిడి చేశారు. అలా మన దేశంతో పాటు ఫారెన్ కంట్రీస్ లో కూడా సెలబ్రిటీలు పుష్పు ఇమిటేట్ చేస్తూ.. రకరకాల వీడియోలు చేశారు. మోత్తానికి సోషల్ మీడియాలో పుష్ప రాజ్ క్రేజ్ అంతకు మించి అన్నట్టు దూసుకుపోయింది. అయితే వాటితో పాటు ఈ సినిమా పాటలు కూడా ఎప్పటి కప్పుడు కొత్త కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్నాయి.
పుష్ప సినిమాకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో.. పాటలకు అంతకు మించి వచ్చింది. మిలియన్ల వ్యూస్ తో పాటలు ఇప్పటికీ దూసుకుపోతూనే ఉన్నాయి. పుష్ప సినిమార రిలీజ్ అయ్యి 7 నెలలు పైనే అవుతున్నా... తాజాగా ఈసినిమా మ్యాజిక్ ఆల్బమ్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.దాక్కో దాక్కో మేక, ఊ అంటావా మావా, శ్రీవల్లి, ఏయ్ బిడ్డా..ఇలా సినిమాలోని మొత్తం పాటలన్నీ కలిపి 5 బిలియన్ వ్యూస్... అంటే 500 కోట్ల వ్యూస్ ను సాధించాయి.
దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ఆర్య, ఆర్య2 పాటలు ఇప్పటికీ యూత్ కు హార్ట్ ఫేవరెట్ గా ఉన్నాయి. అదే క్రేజ్ తో పుష్ప పాటలు కూడా మంచి మ్యూజికల్ హిట్ అయ్యాయి. పుష్ప ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లడంతో మ్యూజిక్ పాత్ర ఎంతో ఉంది. చంద్రబోస్ సాహిత్యం, దేవి స్వరాలు మార్మోగాయి. ఇక ఇదే ఊపుతో పుష్ప2 మూవీని కూడా మొదలు పెట్టబోతున్నారు టీమ్.
ఈసారి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు బన్నీ. ఫస్ట్ పార్ట్ లో తలెత్తిన సమస్యలు, పొరపాట్లు రిపిట్ అవ్వకుండా స్వయంగా బన్నీనే చూసుకుంటున్నాడు. కాస్త ఆలస్యం అయినా.. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన ఉత్సాహంతో త్వరలోనే పుష్ప 2 సెట్స్ మీదకు తీసుకెళ్ళబోతున్నారు టీమ్. పుష్ప2 ను కంప్లీట్ చేయాలనే.. అల్లు అర్జున్.. తన నెక్ట్స్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
