అల వైకుంటపురంలో మూవీతో రెండు వందల కోట్ల వసూళ్ల మార్కు అందుకున్నాడు అల్లు అర్జున్. సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ సినిమాతో అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ ఏమిటో అర్థం అయ్యింది. అందుకే తన లేటెస్ట్ మూవీ పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేశాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప, చిత్రీకరణ జరుపుకుంటుంది.


అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదలైన పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ దుమ్మురేపింది. రికార్డు వ్యూస్ రాబట్టడంతో పాటు, బన్నీ లుక్, మేనరిజం ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి. ఇక పాన్ ఇండియా మూవీ కావడంతో బడ్జెట్ కూడా అదే స్థాయిలో కేటాయిస్తున్నారని సమాచారం అందుతుంది. ముఖ్యంగా అడవులలో యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్ సీన్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట. 


కాగా పుష్ప మూవీలోని ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ కోసం ఏకంగా రూ. 40కోట్లు ఖర్చు చేశారట. పుష్ప సినిమా మొత్తానికి రూ. 200కోట్లు కేటాయించినట్లు సమాచారం అందుతుంది. సుకుమార్ లాంటి దర్శకుడుతో భారీ బడ్జెట్ మూవీ అంటే పుష్ప వెండితెర వండర్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.

 
మైత్రి మూవీ మేకర్స్ పుష్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు. సుకుమార్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.