పుష్ప 2 లాభాల్లో భారీ మొత్తం నిర్మాతలకు కోత.. అల్లు అర్జున్ క్రేజ్ ఇక్కడ పనిచేయలేదా ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం వరల్డ్ వైడ్ గా సంచలనాలు సృష్టిస్తోంది. దాదాపు 1700 కోట్ల వసూళ్లతో బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. అల్లు అర్జున్ క్రేజ్ అంతలా పనిచేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం వరల్డ్ వైడ్ గా సంచలనాలు సృష్టిస్తోంది. దాదాపు 1700 కోట్ల వసూళ్లతో బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. అల్లు అర్జున్ క్రేజ్ అంతలా పనిచేసింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఖాన్ చిత్రాలని మించేలా అల్లు అర్జున్ పుష్ప 2 వసూళ్లు రాబట్టడం విశేషం. నిర్మాతలు భారీగా లాభాలు పోగేసుకుంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చుకుంటే ఆల్రెడీ 150 కోట్లకి పైగా లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది.
కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వసూళ్లు అంత సులభంగా రావడం లేదు. అల్లు అర్జున్ కి క్రేజ్ హిందీలో పోల్చుకుంటే తెలుగులోనే కలెక్షన్ల ఫ్లో ఎక్కువగా ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వసూళ్లు వాస్తున్నాయి కానీ బయట ఉన్నంత జోరు లేదు. దీనికి వివిధ కారణాలని ట్రేడ్ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. సీడెడ్, ఇతర కొన్ని ఏరియాల్లో మాత్రమే పుష్ప 2 బ్రేక్ ఈవెన్ సాధించింది.
పుష్ప 2 జీఎస్టీ లెక్కలు
మిగిలిన ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కి చేరువగా వచ్చింది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే నిర్మాతలకు ఊహించని షాక్ తెప్పేలా లేదు అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 వసూళ్లు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు, నిర్మాతల ఒప్పందం ప్రకారం బ్రేక్ ఈవెన్ దాటి మంచి లాభాలు వస్తేనే బయ్యర్లు జీఎస్టీ కూడా భరిస్తారు. బ్రేక్ ఈవెన్ దగ్గరే ఆగిపోయే జీఎస్టీతో బయ్యర్లకు సంబంధం ఉండదు. ఆ ఏరియాకి సంబంధించిన జీఎస్టీ నిర్మాతలే చెల్లించాల్సి ఉంటుంది.
మైత్రి మూవీ మేకర్స్ లాభాల్లో 35 కోట్లు కోత
ఈ లెక్కన మైత్రి సంస్థకి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో 35 కోట్ల మేర జీఎస్టీ భారం పడనున్నట్లు తెలుస్తోంది. ఇది నిర్మాతలకు ఊహించని షాక్ అనే చెప్పాలి. పుష్ప మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో నష్టాలు మిగిల్చింది అనే టాక్ వినిపించింది. పుష్ప 2 రిలీజ్ అప్పటి నుంచి ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ విషయంలో మొదట రచ్చ జరిగింది.
సంచలనంగా మారిన సంధ్య థియేటర్ ఘటన
ఆ తర్వాత సంధ్య థియేటర్ సంఘటన జరిగింది. ఈ సంఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఎ 11 గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసులు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంఘటనని సీరియస్ గా తీసుకోవడంతో ఎంత పెద్ద రచ్చ అయిందో చూశాం. అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలయ్యాక సినీ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది. అల్లు అర్జున్ ని సినీ ప్రముఖులంతా పరామర్శించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఇకపై ప్రత్యేక షోలు, టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ కేసులో విచారణ కోసం మంగళవారం పోలీసులు అల్లు అర్జున్ ని పిలిచారు. దీనితో బన్నీ విచారణకు హాజరై పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 20 ప్రశ్నల చిట్టాతో పోలీసులు అల్లు అర్జున్ ని విచారించినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ ని పోలీసులు ప్రధానంగా ప్రశ్నించింది.. రేవతి మరణించిన విషయం ఎప్పుడు తెలిసింది ? పోలీసులు థియేటర్ వద్ద మీకు ఆ విషయం చెప్పారా లేదా ? అని ప్రశ్నించారట. అదే విధంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ సంఘటన గురించి మాట్లాడిన తర్వాత మీ వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు మీడియా సమావేశంలో తెలిపారు.. మీకు ఎందుకు అలా అనిపించింది.. అలా అనిపించడానికి కారణాలు ఏంటి ? అని అడిగారట. ఆ తర్వాత సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ సమస్య కి ఫుల్ స్టాప్ పడింది అని అంతా భావిస్తున్నారు.