హీరో అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు రావడంతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
జాతీయ అవార్డు రావడానికి సుకుమార్ కారణమని అల్లు అర్జున్ అన్నారు. ఆయన వలెనే ఇది సాధ్యమైంది. జాతీయ అవార్డు వచ్చిందని తెలియగానే ఒక నిమిషానికి పైగా ఇద్దరం హత్తుకుని ఉండిపోయాం. ఆ ఉద్వేగ క్షణాలు అనుభవించామని అన్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ సహకారం కూడా ఉందన్నారు. గత జనరేషన్, ఈ జనరేషన్ హీరోలకు సాధ్యం కానిది మీరు సాధించారని అడగ్గా... అప్పటి హీరోలతో పాటు ఇప్పటి హీరోలు కూడా జాతీయ అవార్డుకు అర్హులే. అయితే అన్నీ కలిసి రావాలి. నా విషయంలో అన్నీ కుదిరాయి. అలా అని అదృష్టం వలన వచ్చిందని అనను. లక్ కంటే నేను హార్డ్ వర్క్ నే నమ్ముతానని అల్లు అర్జున్ అన్నారు.
అవార్డు గెలుచుకోవడం వెనుక ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ సహకారం మరవలేనిది అన్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది. అల్లు అర్జున్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంటున్నాడన్న వాదనల నేపథ్యంలో ఆయన స్పందించారు. మీకంటూ ఓ ఆర్మీ తయారు చేసుకోవడానికి కారణం ఏమిటంటే... ఇది సహజంగా జరిగే ప్రక్రియే అన్నారు. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి జీవితం ఒక చోట మొదలై టైం గడిచాకా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇందుకు ఉదాహరణగా చాలా మంది ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల కంటే ఉన్నత స్థాయికి వెళతారు. ఇది సహజ ప్రయాణం అన్నారు.
కాగా అవార్డు వచ్చిన అనంతరం అల్లు అర్జున్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు. చిరంజీవి-అల్లు అర్జున్ మధ్య ఆత్మీయ సంబాషణలు జరిగాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. 2024 సమ్మర్ లో పుష్ప 2 విడుదల కానుందని సమాచారం .
