'నా పేరు సూర్య' నెగెటివ్ టాక్ పై బన్నీ రియాక్షన్!

allu arjun on na peru surya movie negative talk
Highlights

అల్లు అర్జున్ నటించిన 'సన్నాఫ్ సత్యమూర్తి','సరైనోడు','డిజే' ఇలా చాలా సినిమాలు 

అల్లు అర్జున్ నటించిన 'సన్నాఫ్ సత్యమూర్తి','సరైనోడు','డిజే' ఇలా చాలా సినిమాలు నెగెటివ్ టాక్ తో మొదలై భారీ వసూళ్లను సాధించాయి. 'డిజే' సినిమా పోస్ట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ లాంగ్ రన్ లో దాన్ని బ్లాక్ బస్టర్ చేసే సత్తా ఒక్క బన్నీ సినిమాలకు మాత్రమే ఉంటుందనే అర్ధం వచ్చేలా మాట్లాడారు. 

తాజాగా బన్నీ నటించిన 'నా పేరు సూర్య' సినిమాకు కూడా మిశ్రమ స్పందన వస్తోంది. ఈ విషయంపై స్పందించిన బన్నీ 'నాకు ఇది అలవాటే.. కొత్త ఏమీ కాదు' అని అన్నారు. అలానే.. ఒక సినిమాకు తనవంతు పూర్తి సహకారం అందించి పని చేస్తానని, అందరికీ నచ్చాలనే కోరుకుంటానని అన్నారు.ఒక్కోసారి నేను హార్డ్ వర్క్ చేయకపోయినా సినిమా సక్సెస్ అవుతుంది. అప్పుడు అసలు నేను దాన్ని నా సక్సెస్ గా భావించనని అన్నారు.

ఈ చిత్ర దర్శకుడు వక్కంతం కూడా సినిమాపై వస్తోన్న నెగెటివ్ టాక్ కాదు.. ఫైనల్ గా వచ్చే కలెక్షన్స్ చూడండి అంటూ బహిరంగంగా వెల్లడించారు. ప్రస్తుతం బన్నీ ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ఆయన తదుపరి సినిమా ఎవరితో అనే విషయంలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ పేరు వినిపిస్తోంది. 

loader