Asianet News TeluguAsianet News Telugu

'పుష్ప 2' తర్వాత బన్ని...ఏ డైరక్టర్ తో చేయబోతున్నాడంటే...

 ఎంతో మంది డైరక్టర్స్ పేర్లు వినపడుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో డైరక్టర్ వచ్చి చేరారు. ఆయనతో సినిమా ఓకే అయ్యినట్లు తెలుస్తోంది. ఆ డైరక్టర్ మరెవరో కాదు 

 Allu Arjun next movie with Surendar Reddy
Author
First Published Dec 27, 2022, 1:23 PM IST


‘పుష్ప’ (Pushpa)సినిమా ఘన విజయంతో మంచి ఊపు మీద ఉన్నాడు అల్లు అర్జున్‌ (Allu arjun). ఆయన క్రేజ్‌ ప్యాన్‌ ఇండియా స్థాయికి చేరిపోయింది. ఆ సినిమాలో తనదైన స్టైల్ మేనరిజంతో బన్ని చెప్పిన ‘తగ్గేదేలే’ డైలాగ్‌ చిన్న పెద్దా తేడాలేకుండా అందరినోళ్లలోనూ నానింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ (Pushpa2)చిత్రంలో అంతకుమించి అనేట్లుగా ‘అసలు తగ్గేదేలే’ అన్న డైలాగ్‌ ఉండబోతునట్లు అల్లు అర్జున్‌ ఇప్పటికే హింట్‌ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బన్ని ఏ సినిమా చేయబోతున్నారనే విషయమై అంతటా చర్చగా మారింది. ఎంతో మంది డైరక్టర్స్ పేర్లు వినపడుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో డైరక్టర్ వచ్చి చేరారు. ఆయనతో సినిమా ఓకే అయ్యినట్లు తెలుస్తోంది. ఆ డైరక్టర్ మరెవరో కాదు సురేంద్రరెడ్డి.

అల్లు అర్జున్ కెరియర్లో చెప్పుకోవలసిన సినిమాల్లో 'రేసుగుర్రం' ఒకటనే సంగతి తెలిసిందే. 2014లో వచ్చిన ఈ సినిమా, వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను నమోదు చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, బన్నీ క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో మంచి రేటింగును రాబడుతూ ఉంటుంది. అంత సూపర్ హిట్  కాంబినేషన్లో ఇంతవరకూ మరో సినిమా రాలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ కు తెర తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కాంబోలో మరో సినిమా రానుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆల్రెడీ బన్నీకి సురేందర్ రెడ్డి కథ వినిపించడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో చేస్తున్న 'ఏజెంట్' సినిమా పనుల్లో సురేందర్ రెడ్డి బిజీగా ఉన్నాడు. పవన్ తో అనుకున్న ప్రాజెక్టు పట్టాలెక్కడానికి చాలా సమయం ఉంది. ఇక బన్నీ చేయాలనుకున్న బోయపాటి కూడా అందుబాటులో లేడు. అందువల్లనే సురేందర్ రెడ్డి - బన్నీ కాంబో ఫిక్స్ అయిందని అంటున్నారు. కొత్త ఏడాదిలో ఈ ప్రాజెక్టు మొదలుకానుందని అంటున్నారు. 

ఇదిలా ఉంటే పుష్ప 2 నుంచి రోజుకో వార్త వినిపిస్తోంది.  ఓ  డైలాగ్‌ సినిమా లీకైనట్లు తెలుస్తోంది. ‘అడవిలోని జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్‌ వచ్చాడని అర్థం’ అన్న డైలాగ్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. పోలా.. డైలాగ్‌ అదిరిపోలా అంటూ అభిమానులు, నెటిజన్లు నెట్టింట ‘పుష్ప:ది రూల్‌(Pushpa : The rule) హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ‘పుష్ప-1’ను మించేలా తెరకెక్కించడానికి దర్శకుడు సుకుమార్‌ కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రష్యాలోనూ విడుదలై సంచలనం సృష్టించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios