టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య తన సంపాదనను సామజిక సేవకు కూడా బాగా ఉపయోగిస్తున్నారు. కేరళ సహాయ నిధి నుంచి మొన్న ఆంధ్రలో తుపాను వరకు అన్ని సందర్భాల్లో తనవంతు సాయంగా నిలుస్తూ ముందుకు సాగుతున్న యాక్షన్ హీరో సొంత ఊరి కోసం కూడా ఒక అడుగు ముందుకేశారు. 

సంక్రాంతి సందర్బంగా పాలకొల్లు వెళ్లిన స్టైలిష్ స్టార్ అక్కడ అభిమానుల కోలాహలంతో గ్రాండ్ వెల్కమ్ ను అందుకున్నాడు. సమీపాన ఉన్న అల్లు రామలింగయ్య విగ్రహం వద్ద సందడి చేసిన బన్నీ త్వరలోనే ఇక్కడ కళ్యాణ మండపం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. పేద వారికీ ఉపయోగపడేలా త్వరలోనే ఆ కార్యక్రమంను అల్లు హీరో మొదలుపెట్టనున్నాడట. 

బన్నీ పాలకొల్లులో కుటుంబంతో కలిసి అభిమానులను కలుసుకున్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. రోజురోజుకి స్టైలిస్ట్ స్టార్ తన మంచి మనసుతో జనాలకు మరింత దగ్గరవుతున్నట్లు అర్ధమవుతోంది. నెక్స్ట్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్స్ లో ఒక సినిమాను చేయనున్నాడు. త్వరలోనే ఆ కొత్త ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలుకానుందని సమాచారం.