Allu Arjun: `పుష్ప2` డిలేకి కారణమదేనా ?.. రాజమౌళి ఎంత పని చేశాడు ?
రెండో భాగంలో పుష్పరాజ్‌గా బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఏలబోతున్నారనేది తెలుస్తుంది. సినిమాలో ఉన్న డైలాగ్‌ని బట్టే `ఇడ ఏలడానికి వచ్చాను` అని అన్నట్టు, రెండో భాగంలో పుష్పరాజ్ ఎదుగుదలని పీక్‌లో చూపించబోతున్నారట.
అల్లు అర్జున్(Allu Arjun) ని పాన్ ఇండియా స్టార్‌ని చేసిన సినిమా `పుష్ప`(Pushpa). ఈ సినిమాతో ఐకాన్ స్టార్ ఇమేజ్ దేశ వ్యాప్తంగా విస్తరించింది. అంతకు ముందే తన స్టయిల్‌కి, డాన్సులకు సౌత్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. `పుష్ప` చిత్రంతో నార్త్ లోనూ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయన మార్కెట్ పెరిగింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన `పుష్ప` మొదట మిశ్రమ టాక్ తెచ్చుకున్నా క్రమంగా పుంజుకుంటూ సంచలన విజయాన్ని సాధించింది. ఇది బాలీవుడ్ వర్గాలకు షాకివ్వడంతోపాటు చిత్ర యూనిట్‌ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. బన్నీ ఊరమాస్ లుక్, యాక్షన్, డైలాగ్ డెలివరీ, పాటలు, బన్నీ స్టెప్పులు, రష్మిక నటన, సుకుమార్ క్రియేటివిటీ సినిమాని బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి.
`పుష్ప` రెండు భాగాలుగా రాబోతుంది. రాజమౌళి(Rajamouli) ఇచ్చిన సలహాతోనే సుకుమార్(Sukumar) ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేసినట్టు తెలిపారు. `పుష్ప` సక్సెస్‌తో `పుష్ప 2`పై భారీ అంచనాలున్నాయి. `పుష్ప`ని మించి రెండో భాగం `పుష్పః ది రూల్` చిత్రం ఉండబోతుందని అంతా ఆశిస్తున్నారు. రెండో భాగంలో పుష్పరాజ్‌గా బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఏలబోతున్నారనేది తెలుస్తుంది. సినిమాలో ఉన్న డైలాగ్‌ని బట్టే `ఇడ ఏలడానికి వచ్చాను` అని అన్నట్టు, రెండో భాగంలో పుష్పరాజ్ ఎదుగుదలని పీక్‌లో చూపించబోతున్నారట. దీంతో ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది.
అయితే `పుష్ప` సినిమా విడుదలై నాలుగు నెలలయ్యింది. ఇంకా రెండో భాగం షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై సరైన క్లారిటీ లేదు. డిలేకి కారణమేంటనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. టాలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. డిలేకి రాజమౌళి కూడా ఓ కారణమని తెలుస్తుంది. మరి ఆ కథేంటో చూస్తే, `పుష్ప` సినిమా భారీ విజయం సాధించడంతో రెండో భాగంపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు రీచ్ కావాలంటే మామూలు విషయం కాదు. అందుకే దర్శకుడు సుకుమార్ ఇప్పుడు స్క్రిప్ట్ పై కూర్చున్నారట. మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట.
సినిమాలో ఊహించిన ట్విస్ట్ లు, హైలైట్ అంశాలు, బన్నీ హీరోయిజం పీక్‌లోకి తీసుకెళ్లాలి. ఇలాంటి మెరుపులు లేకపోతే సినిమా తేలిపోతుంది. అందుకోసం మరింతగా కష్టపడుతుందట సుకుమార్ టీమ్. ఏదో చేశామనేలా కాకుండా చాలా జాగ్రత్తగా, మరింత ప్లాన్ ప్రకారం, హడావుడి లేకుండా రెండో భాగంగా తీయాలని భావిస్తున్నారట. అంతేకాదు ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్`(RRR) సినిమా వచ్చి `పుష్ప`కి మరింత సవాళ్లు విసిరింది. ఇందులో రాజమౌళి చేసిన మెరుపులు హైలైట్‌గా నిలచాయి. హీరోల ఎంట్రీ సన్నివేశాలు, ఇంటర్వెస్ట్ ట్విస్ట్, పులులు, సింహాలతో ఫైటింగ్, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. అందుకే ఈ సినిమాలో బలమైన కథ లేకపోయినా ఆయా సీన్లకోసమైనా ఆడియెన్స్ థియేటర్‌కి వెళ్తున్నారు.
ఇదే ఇప్పుడు `పుష్ప`కి పెద్ద ఛాలెంజింగ్‌గా మారింది. ఇప్పటికే `పుష్ప 2`పై ఎన్నో అంచనాలున్నాయి, ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పైగా `ఆర్‌ఆర్‌ఆర్`లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చూసిన ఆడియెన్స్ ఇంకాస్త ఆశిస్తారు. దానికోసమే సుకుమార్ టీమ్ కష్టపడుతుందట. `ఆర్‌ఆర్‌ఆర్` రేంజ్‌లో భారీ గూస్‌బమ్స్ ఎలిమెంట్స్ ప్లాన్ చేస్తున్నట్టు భోగట్టా. అందుకే షూటింగ్ డిలే అవుతుందని సమాచారం.