Asianet News TeluguAsianet News Telugu

మామయ్య చిరంజీవి బర్త్ డే వేడుకలకు బన్నీ డుమ్మా?

 ప్రస్తుతం బన్నీ విదేశాల్లో ఉండగా ఆయన పాల్గొనకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మామయ్య చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొనడం ఇష్టం లేని అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లారని ఓ వాదన వినిపిస్తుంది.

allu arjun might skip megastar chiranjeevi birthday celebrations
Author
First Published Aug 21, 2022, 8:53 PM IST

మరికొన్ని గంటల్లో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈసారి మరింత ప్రత్యేకంగా వేడుకలు ప్లాన్ చేశారు. మెగాస్టార్ కార్నివాల్ పేరుతో భారీ వేదిక ఏర్పాటు చేశారు. చిత్ర ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు ఈ వేడుకలను స్వయంగా పర్వవేక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం హాజరుకారంటూ నాగబాబు తెలియజేశారు. 

పవన్ కళ్యాణ్ ని మినహాయిస్తే చిరంజీవి కుటుంబ సభ్యులు మొత్తం హాజరుకానున్నారు. మెగా హీరోలందరూ పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్ కి బన్నీ డుమ్మా కొట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం బన్నీ విదేశాల్లో ఉండగా ఆయన పాల్గొనకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మామయ్య చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొనడం ఇష్టం లేని అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లారని ఓ వాదన వినిపిస్తుంది. 

మెగా ఫామిలీలో అనేక కొత్త పరిణామాలు చోటు చేసుకోగా.. అల్లు అర్జున్ సపరేట్ గా ఉంటున్నారని సమాచారం. AA  అంటూ సపరేట్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ మెగా హీరోగా పిలిపించుకోవడం ఇష్టపడడం లేదట. ఆ మధ్య విజయవాడ వేదికగా జరిగిన మెగా  ఫ్యాన్స్ అధ్యక్షుల సమావేశంలో అల్లు అర్జున్ ని వేరు చేసి మాట్లాడారు. అతనికి మెగా ఫ్యాన్స్ సప్పోర్ట్ ఇవ్వకూడదు, ఆయన జనసేనకు ఏమాత్రం సహకరించడం లేదని ఆరోపణలు చేశారు. 

ఇక పాన్ ఇండియా హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ తమ మూలాలు తాత అల్లు రామలింగయ్యగా చెప్పుకుంటారు. ఇటీవల ఆయన అదే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. మొత్తంగా అల్లు అర్జున్ మామయ్య చిరంజీవి బర్త్ డే వేడుకలకు డుమ్మా కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మరి చూడాలి రేపు ఏం కానుందో.. 
 

Follow Us:
Download App:
  • android
  • ios