సాధారణంగా.. స్టార్ సెలబ్రిటీలు.. తమ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ లు ఇస్తుంటారు. ఫర్ ఏ చేంజ్.. ఈసారి స్టార్ సెలబ్రిటీ హీరో అల్లు అర్జున్ కు సర్ ప్రైజ్ లభించింది అది ఏంటీం అంటే..?
ఏ రంగంలో ఉన్నా.. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా.. వారి జీవితంలో మర్చిపోలేని వ్యక్తులు కొంత మంది ఉంటారు. ఇక వారిని ఎప్పటికీ చూడలేమోమో.. ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో.. అని అప్పుడప్పుడు తలుచుకని కాసేపు బాధపడతారు. అయితే ఆతరువాత ఎవరి పని వారిదే. ఈక్రమంలో.. తాజాగా అల్లు అర్జున్ కు అలాంటి సంఘనట ఎదురయ్యింది. ఎంత పెద్ద స్టార్ హీరో హూదాలో ఉన్న వారి జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులను కలిస్తే కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో బన్నీకి సర్ ప్రైజ్ లభించింది. అది కూడా తాను ఎంతగానో అభిమానించే వ్యక్తిని 30 ఏళ్ళ తరువాత కలుసుకున్నాడు అల్లు.
చెన్నైలో ఈవెంట్ లో ప్రత్యేక అతిథిగా పాల్గొనటానికి వెళ్ళారు అల్లు అర్జున్. కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్.. 30 ఏళ్ల తర్వాత ఓ ప్రత్యేక వ్యక్తిని కలిసి ఎంతో ఆనందాన్ని పొందారు. అంతేకాదు ఆమె వల్ల తాను ఎన్నో నేర్చుకున్నానని.. తన జీవితంలో ఆమె స్తాన వేరు అని.. అందుకే ఆమె ఎంతో గొప్ప వ్యక్తి అన్నారు. ఇంతకీ ఆవిడి ఎవరో కాదు.. బన్నీ స్కూల్ టీచర్. ఆమెని పొగడ్తలతో ముంచెత్తారు బన్నీ.
చెన్నైకి చెందిన ఎంటర్ టైన్ మెంట్ వెబ్‌సైట్ బిహైండ్‌వుడ్స్ ఈ మద్య ఓ ఈవెంట్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. ఇక దాంట్లో.. ప్రముఖ మూవీ ఆర్టిస్ట్ లను సెలక్స్ చేసిఅవార్డ్స్ అందించాు. అందులో నిర్వహించింది. సౌత్ ఫిల్మ్ ఇందస్ట్రీ స్టార్స్ చాలా మంది ఈ ఈవెంట్ లో సందడి చేశారు. ఈసందర్భంగా పలువురు స్టార్స్ అవార్డ్స్ అందుకున్నారు. ముఖ్యంగా బన్నీ గోల్డెన్ ఐకాన్ ఆప్ ఇండియన్ సినిమా అవార్డు సొంతం చేసుకున్నాడు . ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి ఈవెంట్ వారు ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు.
అల్లు అర్జున్ చిన్నతనంలో చెన్నైలో చదుకన్నారు.. అప్పుడు చిన్ననాటి స్కూల్ టీచర్ ను స్టేజ్ పైకి తీసుకువచ్చారు. వెంటనే బన్నీ షాక్ అయ్యి.. వెళ్ళి ఆమె కాళ్ళకు సమస్కారం చేశారు. ఆమె స్టేజ్ పైకి రాగానే ఆనందంతో పొంగిపోయాడు. బన్నీ మాట్లాడుతూ.. ఈమె పేరు అంబికా కృష్ణన్.. 3rd క్లాస్ లో.. నాకు పాఠాలు చెప్పిన టీచర్. 30 ఏళ్ల తర్వాత మళ్లీ మేడమ్ ని చూశాను.. చాలా సంతోషం. ఆ స్కూల్లో ఎంతో వమింది విద్యార్థులు ఉననా నేను మాత్రంప్రత్యేకం అని చెప్పాలి అన్నారు బన్నీ.
నాకు పాఠాలు చెప్పడానికి. ఎంతో మంది టీచర్స్ఉన్నారు.. కాని మా క్లాస్ లో 50 మంది స్టూడెంట్స్ ఉంటే.. నాదే లాస్ట్ ర్యాంక్.. ఎందుకో నాకు పెద్దగా చదువు అబ్బలేదు. కానీ ఈ మేడమ్ నన్ను ఎప్పుడూ తిట్టలేదు..పైగా నీకు మార్కులు రాలేదని ఎప్పుడూ బాధపడకు.. జీవితం అంటే కేవలం పరీక్షల్లో వచ్చే మార్కులే కాదు.. ప్రతి ఒక్కరికీ జీవితం అనేది ఒక గొప్ప వరం.. నీకు ఉన్న ప్రతిభ నిరూపించుకుంటే.. ఉన్నతశిఖరాలకు ఎదుగుతావు అంటూ ప్రోత్సహించేవారు. మేడమ్ ని ఇలా చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది అని తన సంతోషాన్ని పంచుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
