ఈ ఏడాది విడుదలైన అతికొద్ది చిత్రాలలో ప్రేక్షకుల ప్రశంశలు దక్కించుకుంది పలాస 1978. పీరియాడిక్ విలేజ్ డ్రామాగా వచ్చిన పలాస 1978లో రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్స్ గా నటించగా, రఘు కుంచె కీలక రోల్ చేయడం జరిగింది. విమర్శకుల మెచ్చిన ఈ మూవీ అనేకం అంది చిత్ర ప్రముఖులను కూడా ఆకట్టుకుంది. ఈ చిత్ర దర్శకుడు కరుణ కుమార్ పై నటులు మరియు నిర్మాతల దృష్టి పడింది. విలేజ్ రివేంజ్ డ్రామాని కరుణ కుమార్ తెరకెక్కించిన విధానం, ఎమోషన్స్ పండించిన తీరు బాగా ఆకట్టుకుంది. 

కాగా దర్శకుడు కరుణ కుమార్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలవడం ఆసక్తికరంగా మారింది. అలాగే కరుణకుమార్ ని చిన్న బహుమతితో బన్నీ అభినందించారు. పలాస చిత్రం చూసి బన్నీ ఎంతో ఇంప్రెస్స్ అయ్యారట. కథను ఎంటర్టైనింగ్ చెవుతూ, అంతర్లీనంగా సందేశం చెప్పిన విధానం బన్నీకి బాగా నచ్చిందట. దీనితో దర్శకుడు కరుణ కుమార్ ని కలిసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. 

శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో ఒకప్పుడు జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఆ రోజుల్లో పల్లె ప్రాంతాల్లో కుల, వర్ణ వివక్ష ఎంతగా వేళ్లూనుకుపోయిందో అర్థం అయ్యేలా దర్శకుడు చక్కగా వివరించారు. పలాస దర్శకుడిని అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో కలిసి అభినందించడం విశిష్టత సంతరించుకుంది. ఇక ఈ చిత్రం కోసం రఘు కుంచె స్వరపరిచిన నకిలీసు గొలుసు సాంగ్ సూపర్ పాప్యులర్ అయ్యింది.