మోసగాళ్లు మూవీ టీజర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంఛ్ చేశారు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ జీ చిన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ టీజర్ ఆసక్తి రేపుతోంది. అరనిమిషం నిడివి గల మోసగాళ్లు టీజర్ లో అనేక విషయాలు ఉన్నాయి. ఇక అమెరికాలో జరిగిన భారీ స్కామ్ గురించి అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చారు. 450 మిలియన్ డాలర్స్ స్కామ్ ని ఉద్దేశిస్తూ ట్రంప్ మాట్లాడుతూ 'దీనికి పాల్పడిన వారిని పట్టుకొని, అంతు చూస్తాం అని వార్నింగ్ ఇచ్చారు' దీనితో అమెరికాలో జరిగిన భారీ స్కామ్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని అర్థం అవుతుంది. గతంలో ట్రంప్ మాట్లాడిన మాటలను సినిమా కోసం భలే వాడేశాడు. 

ఇక ఐ టి స్కామ్ కి పాల్పడే ఆ మోసగాళ్లు కూడా మంచు విష్ణు, కాజల్ అని అర్థం అవుతుంది. సంచుల కొద్దీవున్న  డబ్బులను ఉద్దేశిస్తూ కాజల్ 'ఇది సరిపోతుందా?' అని అడుగగా దానికి సమాధానంగా విష్ణు ' గేమ్ ఇప్పుడే మొదలైంది' అనడం ఆసక్తి కలిగిస్తుంది. కాజల్ మరియు విష్ణుల స్టైలిష్ లుక్ సైతం టీజర్ కి హైలెట్ అనిచెప్పాలి. 

కాజల్, విష్ణు ఈ మూవీలో అన్నా చెల్లెలుగా నటిస్తున్నారు. మరి ఈ కిలాడీ బ్రదర్ అండ్ సిస్టర్ కి అంత పెద్ద ఐ టి స్కామ్ చేయాల్సిన అవసరం ఏమిటనేది కథలో కీలకం కావచ్చు. అల్లు అర్జున్ పోలీస్ అధికారికంగా కామియో రోల్ చేయడం అనేది మూవీకి బాగా కలిసొచ్చే అంశం. ఐ టి స్కామ్ వెనుకున్న మోసగాళ్లను పట్టుకొనే అధికారిగా ఆయన తక్కువ నిడివి గల పాత్రలో మెరవనున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి మరో కీలక రోల్ చేస్తున్న ఈ చిత్రం మొత్తం 5 భాషలలో విడుదల కానుంది.