Asianet News TeluguAsianet News Telugu

అక్కినేని ఫ్యామిలీ హీరోలపై ఐకాన్‌ స్టార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అఖిల్‌ తన తమ్ముడు అంటూ ప్రశంసలు

`మోస్ట్ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` ఈవెంట్‌కి అల్లు అర్జున్‌ గెస్ట్ గా వచ్చారు. ఏఎన్నార్‌ని గుర్తు చేసుకున్నారు. ఏఎన్నార్‌, అల్లు రామలింగయ్య గార్ల నుంచి అక్కినేని ఫ్యామిలీకి, తమకు ఎంతో మంచి అనుబంధం ఉందన్నారు. అఖిల్‌ తన తమ్ముడి లాంటి వాడని ప్రశంసించారు.

allu arjun intresting comments on akkineni heroes and he say akhil like my brother
Author
Hyderabad, First Published Oct 20, 2021, 8:09 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun).. అక్కినేని హీరోలను తలచుకున్నారు. ఏఎన్నార్‌(Anr) నుంచి అఖిల్‌(Akhil) వరకు ఆయన అందరిపై ప్రశంసలు కురిపించారు. వారికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా అఖిల్‌ పాత్రల ఎంచుకునే ఛాయిస్‌ని ప్రశంసించాడు బన్నీ. ఇదంతా `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` సక్సెస్‌ మీట్‌లో జరిగింది. అఖిల్‌, పూజా హెగ్డే జంటగా `బొమ్మరిల్లు` భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన Most Eligible Bachelor చిత్రం దసరా పండుక్కి విడుదలై పాజిటివ్‌ టాక్ ని తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. 

ఈ ఈవెంట్‌కి Allu Arjun గెస్ట్ గా వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఏఎన్నార్‌ని గుర్తు చేసుకున్నారు. ఏఎన్నార్‌, అల్లు రామలింగయ్య గార్ల నుంచి అక్కినేని ఫ్యామిలీకి, తమకు ఎంతో మంచి అనుబంధం ఉందన్నారు. ఏఎన్నార్‌గారు తన ఇద్దరు మనవళ్లు నాగచైతన్య, అఖిల్‌తో కలిసి `మనం` సినిమా చేయడం గొప్ప విషయం. అక్కినేని ఫ్యామిలీ హీరోలు కలిసి చేసిన ఆ సినిమాని బన్నీ అభినందించారు. అలాంటి అవకాశం రావడం అఖిల్‌కి లక్‌ అన్నారు. ఆ సినిమా చివర్లో అఖిల్‌ ఎంట్రీ అదిరిపోయిందన్నారు బన్నీ. 

ఈ సీజన్‌లో అన్నాదమ్ములిద్దరు హిట్‌ కొట్టారన్నారు. ఇటీవల నాగచైతన్య నటించిన `లవ్‌స్టోరి` హిట్‌ అయ్యిందని, ఇప్పుడు అఖిల్‌ `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`తో సక్సెస్‌ కొట్టాడని, వారిని అభినందించారు. ఈ సందర్భంగా నాగార్జునకి అల్లు అర్జున్‌ కంగ్రాట్స్ చెప్పారు. నాగ్‌సర్‌ చాలా ఆనందిస్తుంటారని తెలిపారు. అఖిల్‌ బాగా నటిస్తాడని, బాగా డాన్సులు చేస్తాడని, కానీ తను ఈ పాత్రని ఎంచుకోవడం, మంచి పాత్ర చేయాలనే ఆయన ఛాయిస్‌ తనకు బాగా నచ్చిందన్నారు. అఖిల్‌ని చూస్తుంటే తమ్ముడిలా అనిపిస్తుందన్నారు. 

also read: ట్రాన్ఫ్స రెంట్‌ శారీలో సెగలు రేపుతున్న పూజా హెగ్డే.. అందరు హీరోలకు లక్కీ ఛార్మ్ అంటూ బన్నీ ప్రశంసలు

`బొమ్మరిల్లు` భాస్కర్‌ ఈ సినిమాతో సూపర్‌ హిట్టు కొట్టాడు. తెలుగు రాకపోయినా గోపీసుందర్‌  మ్యూజిక్‌ అద్భుతంగా ఇచ్చారు. బన్నీవాసు, వాసూవర్మ, నాన్నగారు... అందరూ సినిమా సక్సెస్‌ కావాలని చాలా కష్టపడ్డారు. సొంత ఓటీటీ ఉన్నా కూడా థియేటర్లలోనే సినిమాలు విడుదల చేయాలని నాన్నగారు నిర్ణయించుకున్నారు. నాతోపాటు ఇతర హీరోలతోనూ నాన్న అల్లు అరవింద్‌ బెస్ట్ సినిమాలు చేశారు. ఆయన బెస్ట్ ప్రొడ్యూసర్‌. బన్నీ వాసు చాలా కష్టపడుతున్నాడు. పెద్దవాడైపోతున్నాడు. ఎంత పెద్ద అయినా నా ఫ్రెండే అని మర్చిపోకు` అని సెటైర్లు వేశాడు బన్నీ.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, `అక్కినేని, అల్లు ఫ్యామిలీది 65 ఏళ్ల జర్నీ. ఇది ఇంకో రెండు తరాలు సాగుతుంది. ప్రేమికులు, పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్లు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది. భాస్కర్‌ ఈ సినిమాలో ఒక క్లారిటీ ఇచ్చాడు. రియల్‌ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ తమ జీవితంలోకి తరచి చూసుకునేలా సినిమా ఉంది. నా పని చాలా తేలిక చేసిన బన్నీవాసుకి ధన్యవాదాలు. హిందీలో ఆఫర్లు వచ్చినా తెలుగు సినిమాలు చేయమని పూజాను కోరుతున్నా` అని తెలిపారు. 

`అల్లు అరవింద్‌ గారితో వర్క్‌ చేయడం నా అదృష్టం. నన్ను గుండెల్లో పెట్టుకొని పనిచేశారు. కొడుకులా చూసుకున్నారు. ఆయనతో  మళ్లీ పనిచేయాలనుంది. ప్రేక్షకులు ఇచ్చిన ఈ  హిట్‌ను గిఫ్ట్‌లా తీసుకుంటున్నాను` అని అఖిల్‌ తెలిపారు. `ఇలాంటి సక్సెస్‌ చూడడానికి ఎన్నాళ్లు పడుతుందో అనుకున్నాను. కానీ ఈ చిత్రంతోనే ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్‌ ఇచ్చారు. ఒక దర్శకుడికి ఇంతకన్నా ఏం కావాలి. బన్సీవాసు, వాసూవర్మ, అరవింద్‌గారికి థ్యాంక్స్‌. ఈ సినిమాతో అఖిల్‌ కుటుంబ ప్రేక్షకులకి దగ్గరయినందుకు ఆనందంగా ఉంది` అని దర్శకుడు `బొమ్మరిల్లు` భాస్కర్‌ చెప్పారు. 

also read: హాట్‌ షోలో రెచ్చిపోయిన నిధి అగర్వాల్‌.. పోగుల్లాంటి డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలను చూస్తే చెమటలు పట్టాల్సిందే
 

Follow Us:
Download App:
  • android
  • ios