Asianet News TeluguAsianet News Telugu

#AlluArjun: బోయపాటితో సినిమాకు బన్ని ఓ కండీషన్

బోయపాటి శ్రీనివాస్, రామ్ పోతినేని కాంబినేషన్ లో  రూపొందిన ‘స్కంద’ సినిమా డిజాస్టర్ అయింది. ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద బాంబులా  పేలడమే ...

Allu Arjun inserted a clause for Boyapati Srinivas! jsp
Author
First Published Nov 27, 2023, 10:13 AM IST

వరస హిట్స్ ఇచ్చే డైరక్టర్ కు ఏ హీరో కండీషన్ పెట్టడు..చివరకు కథ కూడా వినడు. అయితే అన్ని సార్లు..అందరి దర్శకులకు సాధ్యం కాదు. అలాంటప్పుడు ఫ్లాఫ్ వచ్చిన దర్శకుడు వెళ్లి హీరోకు కథ చెప్పే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కండీషన్స్ ,క్లాజ్స్ ఉంటాయి. అలాంటి సిట్యువేషన్ ఇప్పుడు బోయపాటికి ఎదురైందని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి గతంలో సరైనోడు సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అప్పట్నుంచి మళ్లీ బోయపాటి కాంబినేషన్‌లో సినిమా రావాలని బన్నీ అభిమానులు కోరుకుంటున్నారు. 

అయితే పుష్ప  తర్వాత బన్నీ ఇమేజ్ మారిపోయింది. దాంతో ఆచి,తూచి అడుగులు వేయాల్సిన పరిస్దితి. ప్యాన్ ఇండియా స్దాయినుంచి వెనక్కి వెళ్లదలుచుకోలేదు. దాంతో తనకు సరైనోడు వంటి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటికు కండీషన్స్ పెట్టక తప్పలేదంటున్నారు.  బోయపాటి శ్రీనివాస్, రామ్ పోతినేని కాంబినేషన్ లో  రూపొందిన ‘స్కంద’ సినిమా డిజాస్టర్ అయింది. ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద బాంబులా  పేలడమే కాకుండా, బోయపాటి కు బ్యాడ్ నేమ్ తెచ్చింది. ఈ సినిమాలో ఎక్కడా  లాజికల్ సీన్స్ లేవని అన్నారు. ఈ సినిమా సోషల్ మీడియాలో కామెడీ  వస్తువుగా మారింది. దాంతో ఇప్పుడు మరో దర్శకుడుతో సినిమా అనగానే ఖచ్చితంగా బోయపాటి చెప్పే కథ వైపు జాగ్రత్తగా చూస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. 

అందుతున్న సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను, ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాపైనే వర్క్ చేస్తున్నాడు.   స్కంద సినిమా  ప్రచారంలోనే బన్నీతో సినిమాపై స్పందించాడు బోయపాటి. సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు. బోయపాటి  ఇప్పుడు అల్లు అర్జున్‌ని డైరెక్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడు. “పుష్ప 2” పూర్తయ్యాక, దర్శకుడు త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం ప్రారంభం మధ్య, అల్లు అర్జున్‌కు 6 నుండి 8 నెలల గ్యాప్  ఉంటుంది. ఆ టైమ్ లోనే  ఓ సినిమాని పూర్తి చేయాలని బన్నీ భావిస్తున్నాడు.  అయితే బన్నీ, బోయపాటికి ఛాన్స్ ఇస్తాడా అనేది అందరికీ  డౌట్ . 

బోయపాటి చెప్పిన  స్క్రిప్ట్ నిజంగా నచ్చితేనే సినిమాకి ఓకే చేస్తానని అల్లు అర్జున్ బోయపాటికి చెప్పాడట.మరీ ముఖ్యంగా స్క్రిప్ట్ వీలైనంత సాలిడ్‌గా, లాజికల్‌గా ఉండాలని క్లియర్ గా చెప్పారని వినిపిస్తోంది. దాంతో తన దగ్గర ఉన్న పాయింట్ తో అల్లు అర్జున్ కు నచ్చేలా  బోయపాటి కథను సిద్ధం చేస్తున్నాడట.

మరో ప్రక్క అల్లు అర్జున్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా యూనివర్సల్ ఆడియన్స్ కోసం సినిమాలు చేయాలనుకుంటున్నాడు.  దాంతో  పాన్ ఇండియా డైరక్టర్ల కోసం చూస్తున్నాడు.
ఈ సమయంలోనే బన్నీతో సినిమా చేయాలని బోయపాటి ట్రైల్స్ కొంచెం ఇబ్బందే అంటున్నారు . అయితే, దర్శకుడి బోయపాటి స్టైల్‌ని, మాస్ ఆడియన్స్‌పై ఆయనకున్న అవగాహనన ఇష్టపడి మాత్రం అల్లు అర్జున్ ప్రాజెక్టు ఓకే చేయాల్సి  ఉంటుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios