`ఆహా`లో అల్లు అర్జున్ ప్రాజెక్ట్.. అసలు విషయం తేలేదీ రేపే!
ప్రస్తుతం `పుష్ప2`తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన సొంత ఓటీటీ సంస్థ అయిన `ఆహా`లో ఒరిజినల్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ రేపు రాబోతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండియా మోస్ట్ వాంటెడ్ మూవీ `పుష్ప2`లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్‌కి ఇంకా ఏడాదైనా పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు బన్నీ మరో సినిమా చేయడం కష్టం. ఆయన ఇప్పటికే నెక్ట్స్ సినిమాల కమిట్ మెంట్లు ఉన్నాయి. కానీ చేసే టైమ్ లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బన్నీకి సంబంధించిన ఓ అప్డేట్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఓటీటీలో అల్లు అర్జున్ ఓ షో చేయబోతున్నారు.
తమ సొంతం ఓటీటీ సంస్థ అయిన `ఆహా`లో బన్నీ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. `పుష్ప2` లాంటి భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఓటీటీలో సినిమా చేయడమేంటనే డౌట్ అందరిని తొలుస్తుంది. అయితే `ఆహా` ఒరిజినల్ బన్నీ చేయబోతున్నారని సమాచారం. అయితే వెబ్ సిరీస్ కానీ, వెబ్ ఫిల్మ్ కానీ బన్నీ చేయబోతున్నారనేది తాజాగా టీమ్ ఇచ్చిన అప్డేట్ ని బట్టి అర్థమవుతుంది. కాకపోతే ఇందులో బన్నీ నటించడం కాకుండా దాన్ని నిర్మిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు `ఆహా`లో బన్నీ ఓ టాక్ షో చేస్తున్నారనేది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. తాజాగా వచ్చిన అప్డేట్ దానికి సంబంధించినదేనా? అనేది తెలియాల్సి ఉంది. రేపు ఉదయం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సస్పెన్స్ కి తెరదించబోతున్నారని, అసలు విషయం రేపు తేలబోతుందని తెలుస్తుంది. మరి `ఆహా`ని టేకోవర్ చేసిన బన్నీ ఏం చేయబోతున్నారనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
ఇక అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప2` చిత్రీకరణ దశలో ఉంది. వెకేషన్‌కి వెళ్లిన బన్నీ ఇటీవల తిరిగి వచ్చారు. మొన్న వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలోనే ఆయన మళ్లీ `పుష్ప2` షూటింగ్లో జాయిన్ కాబోతున్నారని సమాచారం. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఫహద్ ఫాజిల్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు రెండో భాగంలో కొత్త నటీనటులు యాడ్ కాబోతున్నారని సమాచారం.