ఆల్రెడీ ఇంటర్నెట్ ను సునామీ తరహాలో షేక్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ గురించి మనం చెప్పుకున్నాం. 'ఒరు అడార్ లవ్' అనే కొత్త మళయాళం సినిమాలోని మాణిక్య మలరాయ పూవి అనే పాట విడుదలవ్వగానే.. ఆ పాటలో ఒక హీరోయిన్ గా కనిపించిన ఈ మల్లూ చిన్నది.. తన కను రెప్పలను పైకీ కిందకి ఎగరేసి నాట్యం చేస్తూ.. పిచ్చెక్కిచ్చింది. హోల్ ఇండియా అంతా ఈ ఫీటుతో పడిపోయారు. 

ఇప్పుడీ లిస్టులోకి అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. అయితే పైకి ఆ అమ్మాయి గురించి చెప్పలేదు కాని.. ఆ వీడియోను ట్వీట్ చేస్తూ.. ''ఈ మధ్యకాలంలో నేను చూసిన చాలా క్యూట్ వీడియో ఇది. సింప్లిసిటీ పవర్ ఎలా ఉందో చూడండి. బాగా నచ్చేసింది'' అంటూ చెప్పాడు. అయితే బన్నీ ఎంత ఈ వీడియోను క్యూట్ అని చెప్పినా కూడా.. అక్కడ మ్యాజిక్ మాత్రం ఆ పిల్ల చేసిందనేది తెలుస్తూనే ఉంది. బన్నీ వంటి పెద్ద స్టార్ కు కూడా ఈ పిల్ల నచ్చేసిందంటే.. మరి అమ్మడు త్వరలో తెలుగులో తెరంగేట్రం చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. పైగా మలయాళం భామలంటే మన తెలుగు ఇండస్ర్టీలో అదో రకమైన పెషల్ యభిమానం ఉండనే ఉంది. 

అంతే కాదండోయ్.. ఇక బన్నీ వంటి స్టార్ల సంగతి పక్కనెట్టేస్తే.. ఒక్క రోజులో ఆ పిల్ల ఇనస్టాగ్రామ్ పేజీకి ఏకంగా 6 లక్షల లైక్స్ వచ్చాయట. పెద్ద పెద్ద స్టార్లు ఇంటర్నెట్లులోకి అడుగుపెట్టి సోషల్ మీడియా ఖాతా తెరిచినప్పుడు కూడా ఈ రేంజులో జనాలు ఫాలో అవ్వలేదు. కాని ఈ చిన్నదాని హొయల ముందు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందేననమాట.