"పుష్ప" పాత్రకి ఆ లోపం, శ్రీవల్లి పాటలో లీక్,బన్ని కి చాలా కష్టం
తాజాగా వచ్చిన ఈ సాంగ్ ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి...మాటే మాణిక్యమాయనే శ్రీవల్లి...చూపే బంగారమాయనే శ్రీవల్లి... నవ్వే నవరత్నమాయనే’ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. పల్లెటూరి యువకుడిగా అల్లు అర్జున్ సాంగ్‌లో పూర్తిగా ఒదిగిపోయి కనిపించాడు.
స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ మూవీలో హీరోయిన్ రష్మిక మందన్నా. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే..’ ప్రోమో విడుదల చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాట చూసిన వారికి అందులోని కొన్ని ఫొటోల్లో అల్లు అర్జన్ పాత్ర గురించి ఓ ఇన్ సైట్ రివీల్ అయ్యింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అదేంటంటే..
ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ చేస్తున్న చిత్రం "పుష్ప". ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. రష్మికా మందన్నా పల్లెటూరి యువతిగా కనిపించనుండగా ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోకు భుజం సమస్య ఉండబోతోందిట. ఇంతకు ముందు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ ఒక చెవిటి వాడి పాత్రలో కనిపించారు. తాజాగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్ర కూడా ఒక లోపం ఉండబోతుందట. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు కుడి భుజం సరిగ్గా పనిచేయదట.
https://www.youtube.com/watch?v=5IEbR79kBPY&feature=emb_title&ab_channel=AdityaMusic
అయితే ఫస్ట్ సింగిల్ లో అందుకే ఎలాంటి అనుమానాలు కలిగించకుండా "దాక్కో దాక్కో మేక" పాట ని మేనేజ్ చేసారు.అయితే రెండో పాట ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే..’ అయితే ఇది రివీల్ చేసేసారు. దాంతో ఈ సినిమా గురించి మాట్లాడుకోవటం ఎక్కువైంది. ఇలా జనాల్లో డిస్కషన్ పాయింట్ గా నిలవాలనే ఈ విషయాన్ని హైడ్ చేసి క్లూ ఇచ్చారంటున్నారు. అయితే ఇలా కుడి భుజం పనిచేయకపోవటం అనేది నిజం అయితే షూటింగ్ మొత్తం అలాగే కనపడాలంటే చాలా పెద్ద ఛాలెంజే. ఖచ్చితంగా భుజాన్ని అలా లోపంగా చూపాలంటే పెయిన్ అయితే ఉంటుంది. పెయిన్ ని భరిస్తూ షూట్ చేసారన్నమాట అల్లు అర్జున్. మరి ఈ లోపం సినిమాలో ఎలా ఉండబోతోందో చూడాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.
మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు జగపతి బాబు, ప్రకాష్ రాజ్ మరియు సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక మలయాళం, తమిళ్, హిందీ మరియు కన్నడ భాషలలో కూడా డబ్ కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తుండగా.. మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కానుంది.