`నా జీవితం ఇంత సక్సెస్ ఫుల్ గా సాగుతుందంటే అది కేవలం సుకుమార్ వల్లే` అంటూ అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు సుకుమార్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
`సుకుమార్ లేకపోతే నేను లేనని, నా జీవితంలో రుణపడి ఉన్నాను అనే పదాన్ని చాలా తక్కువ మందికి వాడతానని, అందులో సుకుమార్ ఒకరు` అని తెలిపారు అల్లు అర్జున్. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన `పుష్ప` సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పటికే వసూళ్లు 280 కోట్లు సాధించినట్టు యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్. ఈ నేపథ్యంలో ఈ చిత్ర థ్యాంక్స్ మీట్ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇందులో బన్నీపై సుకుమార్, సుకుమార్‌పై బన్నీ ప్రశంసల వర్షం కురిపించారు. తాను నీళ్లో మునిగిపోతున్నప్పుడు బన్నీ కాపాడాడని సుకుమార్ ఎమోషనల్ అయ్యారు. ఇక సుకుమార్ లేకపోతే నేను లేనని బన్నీ కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం.
బన్నీ మాట్లాడుతూ, ఈ రోజు సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నా జీవితంలో రుణపడి ఉన్నాను అనే పదాన్ని చాలా తక్కువ మందికే వాడతాను. మా తాతగారికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, సినిమాల్లో ఫస్ట్ నుంచి నన్ను ప్రోత్సహిస్తున్న చిరంజీవిగారికి రుణపడి ఉన్నాననే మాట వాడతాను. ఆ తర్వాత నేను సుకుమార్‌కే ఆ మాటను వాడతాను. నాకు సుకుమార్ అంటే అంత ఇష్టం. `పరుగు` సినిమా సమయంలో నేను 85 లక్షలు పెట్టి ఓ కారు కొన్నాను. స్టీరింగ్‌పై చేయివేసి నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరని ఆలోచించగా నాకు ఫస్ట్ గుర్తొచ్చిన పేరు సుకుమార్. డార్లింగ్ నువ్వు లేక పోతే నేను లేను.. ఆర్య లేదు.. మరేమీ లేవు. నా జీవితం ఇంత సక్సెస్ ఫుల్ గా సాగుతుందంటే అది కేవలం సుకుమార్ వల్లే` అంటూ అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
అంతేకాదు సుకుమార్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి వారిని మాత్రమేకాదు, బన్నీ అభిమానుల హృదయాలను సైతం తాకాయి. భావోద్వేగానికి గురి చేశాయి. ఇకపై తన సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఇలా థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేస్తామని, సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటానని తెలిపారు. హిట్ చిత్రానికైనా, ఫ్లాప్‌సినిమాకైనా కష్టం ఒక్కటే అని తెలిపారు ఐకాన్ స్టార్.
`పుష్ప` సినిమా తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని రష్మిక మందన్నా తెలిపింది. ఆమె థ్యాంక్స్ మీట్‌లో మాట్లాడుతూ, `ఈ చిత్రంలో నన్ను సెలెక్ట్ చేసినందుకు దర్శకుడు సుకుమార్ కి థాంక్స్. ఆయన నాలో శ్రీవల్లిని ఎలా చూసాడో తెలియదు. ఏదైనా సినిమా అయిపోతే ఎమోషనల్ గా ఫీల్ అవుతారు కానీ `పుష్ప` అయిపోతే సంతోషంగా ఉంది. ఎందుకంటే రెండు నెలల్లో కలిసి పార్ట్ 2 కోసం పని చేయబోతున్నాం కాబట్టి. ఇది నా కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్. అది నాకు ఇచ్చిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. దర్శకుడు సుకుమార్.. హీరో అల్లు అర్జున్ గారికి థాంక్స్` అని తెలిపారు.
ఇదిలా ఉంటే `పుష్ప` సినిమాపై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించారు. `పుష్ప` ఓపెనింగ్ కలెక్షన్లను హిందీ సినిమాలు అందుకోలేపోయాయని తెలిపారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు సినిమాపై, బన్నీపై ప్రశంసలు కురిపించగా.. తాజాగా కరణ్ జోహార్ కూడా కొనియాడారు. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ `పుష్ప`కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని అన్నారు. బన్నీకి బాలీవుడ్‌లో ఆ స్టార్‌డమ్ రావడానికి గల కారణాన్ని కరణ్ చెబుతూ, `ఓటీటీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు సినిమాలు హిందీలో డబ్ అవుతున్నాయి. దీంతో ఆయా నటులకు కూడా ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కి బాలీవుడ్‌లో క్రేజ్ పెరిగింది. దాన్ని ఎవరూ ఆపలేరు` అని తెలిపారు కరణ్.
also read: Allu Arjun Emotional: సుకుమార్ ఎమోషనల్ స్పీచ్‌కి కంటతడి పెట్టుకున్న బన్నీ.. పుస్తకంగా `పుష్ప`
also read: Rashmika hot looks: థైస్ కనిపించేలా రష్మిక కిర్రాక్ పోజులు.. సమంతపై ఇంట్రెస్టింగ్ కామెంట్
