Asianet News TeluguAsianet News Telugu

Allu Arjun : అదరగొట్టిన ఐకాన్ స్టార్... ఇన్ స్టాలో 15 మిలియన్ ఫాలోయర్స్‌ను సొంత చేసుకొని సరికొత్త రికార్డు..

మీడియం ఏదైనా  ఐకాన్ స్టార్ అల్టు అర్జున్ కు మ్యాగ్జిమమ్ ఫ్యాన్ ఫాలోయింగ్  ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే అల్లు అర్జున్ మూవ్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.  దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకు సాధ్యం కాని రీతిలో బన్నీకి  ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. కొత్తగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 

Allu Arjun Got 15 Millions of Fans in Instagram, socila media post
Author
Hyderabad, First Published Jan 14, 2022, 4:07 PM IST

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బన్నీని ఏకంగా 15 మిలియన్ ఫాలోయర్స్ ఆదరిస్తున్నారు. అంటే కోటి 50 లక్షల మంది ఫాలోయర్స్ ను స్టైలిష్ స్టార్ తన ఫ్యాన్ ఖాతాలో వేసుకున్నాడు.  సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఈయనే అల్లు అర్జున్ కావడం విశేషం. 
అయితే అల్టు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగున్నర ఏండ్లలోనే  పెద్ధ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించడం గొప్ప విషయం. 

అధికారికంగా 2017, నవంబర్‌లో ఇన్‌స్టాలోకి అడుగెట్టిన అల్లు అర్జున్ మెరుగు వేగంతో ఫ్యాన్స్ కు దగ్గరయ్యారు. క్రమం తప్పకుండా అభిమానులతో తన విషయాలను పంచుకుంటూ వచ్చారు.  అభిమానులూ తన షేర్ చేసే పోస్ట్ లపై  ఎక్కువగా ఆసక్తి చూపేవారు. అందుకు తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే వారు. అప్పటికే  తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ ఉన్న బన్నీకి  ఫాలోయర్స్‌ పెరుగుతూ వచ్చారు.  ప్రస్తుతం ఏకంగా 15 మిలియన్ మైలురాయిని అందుకున్నారు అల్లు అర్జున్.  ఈ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరో అల్లు అర్జునే అవడంతో అభిమానులు  ఆయన్ని సౌత్ కా సుల్తాన్ అని పిలుస్తున్నారు. ట్విట్టర్‌లోనూ అల్లు అర్జున్‌కు 6 మిలియన్ ఫాలోయర్స్ పైగా ఉన్నారు. ఇన్ స్టా మరియు ట్విట్టర్ లో మొత్తం 21 మిలియన్ ఫాలోవర్స్ ను  దక్కించుకున్నారు ఐకాన్ స్టార్. 

15 మిలియన్ ఫాలోయర్స్ కు చేరుకోవడంతో  అల్టు అర్జున్ తన ఇస్టాలో అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను ఎంతో సంతోషాన్ని వ్యక్త పరిచారు. ఎంతో సపోర్ట్ చేస్తున్న అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.  

ఇప్పుడు టాలీవుడ్ లో అల్లు అర్జున్ హవా కొనసాగుతుండగా, పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగారు. పుష్ప (pushpa): ది రైజ్ మూవీతో అభిమానులను మరింత ఖుషీ చేశారు. ఈ మూవీకి అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన లభించింది.  దీంతో పుష్ప రూల్ పై అభిమానులు ఆశలు పెంచుకున్నారు. ‘పుష్ప రూల్’ ఇంతటి రెస్పాన్స్ పొందగలిగితే పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్న  ఐకాన్ స్టార్ కు ఇప్పటితో పోల్చితే  రెండింతలు ఫాలోవర్స్ పెరిగే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios