శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ 'సామజవరగమన'. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ చిత్రం ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రంలో హాస్యాన్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. దీనితో శ్రీవిష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫన్నీ రాబరీ కథలు, అలాగే కథా బలం ఉన్న ఎమోషనల్ చిత్రాలు కూడా చేస్తున్నాడు. శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ 'సామజవరగమన'. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ చిత్రం ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రంలో హాస్యాన్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. క్రిటిక్స్ కూడా మంచి రివ్యూలు ఇచ్చారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు, సీనియర్ నటుడు నరేష్, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ హైలైట్ గా నిలిచిందని అంటున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ బలంగా ఆడియన్స్ లోకి వెళ్లడంతో కలెక్షన్స్ సాలిడ్ గా ఉన్నాయి. అదే విధంగా సెలెబ్రిటీల నుంచి కూడా ఈ చిత్రాన్ని అద్భుతమైన రెస్పాన్స్ సపోర్ట్ వస్తోంది.

ఇప్పటికే రవితేజ, గోపీచంద్ , అడివి శేష్ సామజవరగమన చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో ఈ చిత్రానికి రివ్యూ ఇచ్చారు. 'సామజవరగమన చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు. ఇది అసలైన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేశా. దర్శకుడు రామ్ అబ్బరాజు చాలా బాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. శ్రీవిష్ణు రాకింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అతడి పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నా.
వెన్నెల కిషోర్, నరేష్ తమ పాత్రలతో ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్పది. నా మలయాళీ అంటూ హీరోయిన్ రెబ్బా మౌనికని బన్నీ ప్రత్యేకంగా అభినందించారు. మలయాళం పై బన్నీకి ప్రత్యేక ఆసక్తి, అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. ఇది 100 శాతం తెలుగు ఎంటర్టైన్మెంట్ మూవీ అని బన్నీ ప్రశంసలు కురిపించారు.
