గత వారం అల్లు అర్జున్‌కి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే ఆయన హోం క్వారంటైన్‌ అయ్యారు. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్‌ ఇచ్చాడు బన్నీ. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. `ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కొద్దిగా లక్షణాలున్నాయి. కోలుకుంటున్నాను. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోనే ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను త్వరగా కోలుకోవాలని మీ ప్రేమని చూపిస్తూ, ప్రార్థనలు చేస్తున్న అందరికి ధన్యవాదాలు` అని తెలిపారు. 

తన హెల్త్ అప్‌ డేట్‌ ఇవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్‌ని చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందే కరోనా బారిన పడ్డ పవన్‌ కళ్యాణ్‌ ఇంకా కోలుకోలేదా? ఆయన హెల్త్ అప్‌డేట్‌ ఇంకా రాకపోవడంతో పవన్‌ ఫ్యాన్స్ ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. అలాగే కళ్యాణ్‌ దేవ్‌ సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.