Asianet News TeluguAsianet News Telugu

కూతురు అర్హాతో కలిసి అల్లు అర్జున్ అల్లరి పనులు, వైరల్ అవుతున్న వీడియో.!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అల్లు అర్హాతో కలిసి చేసిన అల్లరి పనులు అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తండ్రీకూతురి తాజా  సంభాషణకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Allu Arjun fun with his daughter Arha, the video is going viral!
Author
First Published Sep 20, 2022, 11:19 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తున్నారు. భారీ స్కేల్ చిత్రాలతో బిజీ షెడ్యూల్ ను ఫాలో కావాల్సి వస్తోంది. బన్నీ కేరీర్ లో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబ సభ్యుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. భార్య స్నేహా, కొడుకు, కూతురితో ఎంతో సరదాగా ఉంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కు కూతురు అల్లు అర్హా (Allu Arha) అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. తండ్రీకూతురు కలిసి చేసే అల్లరి పనులకు అభిమానులు కూడా ఖుషీ అవుతుంటారు. అందుకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకుంటారు. తాజాగా మరో క్యూట్ వీడియోను పోస్ట్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. 

ఈ వీడియోలో అల్లు అర్హాతో బన్నీ సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది. అర్హా క్యూట్ గా మాట్లాడుతుంటే బన్నీ ఎంతగానో మురిసిపోయాడు. ఈ సందర్భంగా ‘గంగి గోవు పాలు గంటెడైనా చాలు’ అనే పొడుపు కథ వేయగా.. బన్నీ ‘జున్ను’ అని సమాధానం ఇచ్చాడు. వెంటనే పుష్ఫ రాజ్ కే టంగ్ ట్విస్టర్ టాస్క్ ఇస్తూ ‘నాలుగు ఎర్ర లారీలు, నాలుగు నల్ల లారీలు’ను తప్పులేకుండా స్పీడ్ గా చెప్పాలంది. అల్లు అర్జున్ కూతురి చెప్పిందాన్ని అలాగే రిపీట్ చేయడంతో అర్హా ఖుషీ అయ్యింది. ప్రస్తుతం ఈ తండ్రీకూతురు సంభాషణ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. 

అల్లు అర్జున్ తన పిల్లలను కూడా సినీ ఫంక్షన్లకు తీసుకెళ్తుంటారు. మరోవైపు మన సంస్కృతి సంప్రదాయాలను, ప్రత్యేక పండగల గురించి చెబుతూ ఉంటారు. ఇటీవల గణేష్ నవరాత్రి ఉత్సవాల్లోనూ అల్లు అర్హాతో కలిసి సందడి చేశారు. నిమజ్జన కార్యక్రమాల్లోనూ కూతురితో కలిసి పాల్గొనడం విశేషం. అంతకుముందు 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పిల్లలు, భార్య అల్లు స్నేహాతో కలిసి ‘గీతా ఆర్ట్స్’ కంపెనీలో నిర్వహించిన వేడుకలకూ హాజరై దేశభక్తిని చాటుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్ ‘పుష్ఫ 2’(Pushpa 2) చిత్రంపై ఫోకస్ పెట్టారు.  త్వరలో చిత్ర రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్, లోకేషన్స్, ఆర్టిస్టులను ఫైన్ చేశారు. షూటింగ్ ప్రారంభం కావడమే మిగిలి ఉంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios