Asianet News TeluguAsianet News Telugu

`పుష్ప2` అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్ ఆందోళన.. గీతా ఆర్ట్స్ ముందు నిరసన

 `పుష్ప2` చిత్ర నిర్మాణ సంస్థపై బన్నీ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. `పుష్ప 2` అప్‌డేట్‌ కావాలంటూ ఆందోళనకి దిగారు.  ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్‌ గా మారింది. 

allu arjun fans demanding for pushpa 2 update protest at geetha arts
Author
First Published Nov 14, 2022, 6:14 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా `పుష్ప 2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ రాలేదు. ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. `పుష్ప` పార్ట్ వన్‌ విడుదలై ఏడాది కావొస్తుంది. కనీసం పోస్టర్‌ కూడా లేదు. షూటింగ్‌ స్టార్ట్ చేయడానికే చాలా టైమ్‌ తీసుకున్నారు దర్శకుడు సుకుమార్‌. ఆ మధ్యనే చిత్రీకరణ ప్రారంభమై, మధ్యలో గ్యాప్‌తీసుకున్నారు. లొకేషన్ల విషయంలో సంతృప్తిగా లేని సుకుమార్‌ గ్యాప్‌ ఇచ్చినట్టు తెలిసింది. 

అయితే ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఇటీవలే షూటింగ్‌ని ప్రారంభించారని టాక్‌. దీంతో శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థపై బన్నీ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. `పుష్ప 2` అప్‌డేట్‌ కావాలంటూ ఆందోళనకి దిగారు. గీతా ఆర్ట్స్ ముందు కొందరు బన్నీ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ప్రదర్శించి తమ నిరసన తెలియజేయడం గమనార్హం. అప్‌ డేట్‌ ఇవ్వకపోతే మైత్రీ మూవీ మేకర్స్ ముందు ధర్నాకి దిగాల్సి వస్తుందంటూ నినాదాలు చేశారు. మరి దీనిపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.  

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ సంస్థతోపాటు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళ హీరో ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్నారు. అనసూయ, సునీల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు పార్ట్ 2లో మరికొందరు స్టార్‌ యాక్టర్స్ యాడ్‌ కాబోతున్నట్టు సమాచారం. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్‌ 17న `పుష్ప` విడుదలైన విషయం తెలిసిందే. మిక్డ్స్ టాక్‌తో రిలీజ్‌ అయిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. బాలీవుడ్‌ కలెక్షన్ల సునామీ సృష్టించింది. సుమారు మూడు వందల కోట్ల కలెక్షన్లు సాధించింది. పుష్పరాజ్‌గా బన్నీ విజృంభించడం, పాటలు, రా గా సాగే కథ, సుకుమార్‌ టేకింగ్‌ సినిమాకి తిరుగులేని విజయాన్ని అందించాయి. మరోవైపు అవార్డుల పరంగానూ సత్తా చాటిందీ చిత్రం. సైమా, ఐఫా ఫిల్మ్ వేడుకల్లో అవార్డులను కొల్లగొట్టింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios