కొత్త వ్యాపారంలోకి అల్లు అర్జున్

allu arjun enters into new business
Highlights

  • సినిమాలతోపాటు బిజినెస్ లో రాణిస్తున్న యంగ్ హీరోలు
  • తాజాగా మరో కొత్త బిజినెస్ లో అడుగుపెట్టిన అల్లు అర్జున్
  • జుబ్లీహిల్స్ లో స్పోర్ట్ బార్ లో పెట్టుబడులు పెట్టిన అల్లు అర్జున్

వ్యాపార రంగంలో రానిస్తున్న తెలుగు సినీ సెలెబ్రిటీలు చాలా మందే వున్నారు. ఇటు సినిమాలు చేసి సంపాదిస్తూ... రకరకాల బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సెలబ్రెటీలు, స్పోర్ట్స్ స్టార్లు వివిధ వ్యాపారాలు చేసుకునే కల్చర్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. అయితే బిజినెస్ లో చాలా మంది సక్సెస్ అవుతున్నా కొందరు మాత్రం వైఫల్యం చెందుతున్నారు. నవదీప్, తరుణ్ లాంటి నటులు పబ్ వ్యాపారాల్లో దిగి సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

 

పబ్ వ్యాపారం మూలంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందనే ఆలోచనతో బన్నీ క్రికెటర్లూ, బాలీవుడ్ హీరోల తరహాలో ఫుడ్ బిజినెస్ వైపుకి మళ్ళాడు. ఇప్పటికే 800 జూబ్లి పేరుతో ఒక పబ్ ఎలాగూ ఉంది. అల్లు అర్జున్ కు వ్యాపారాలు కొత్తకాదు. కొన్ని రోజుల క్రితమే బన్నీ ఇదే ప్రాంగణంలో కానోలీ కేఫ్ అంటూ ఓ స్విస్ బేకరీని కూడా స్టార్ట్ చేశాడు.

 

ఇప్పుడు మళ్ళీ హైద‌రాబాద్‌లో బన్నీ ఓ స‌రికొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత స్పోర్ట్స్ బార్ అయిన `బి-డ‌బ్స్` ఫ్రాంచైజీలో భాగ‌స్వామిగా చేరాడు. హైద‌రాబాద్‌లో తొలిసారిగా "బి-డ‌బ్స్" ను శుక్ర‌వారం రాత్రి ప్రారంభించాడు. ఇప్పటికే పలు బిజినెస్ లు మొదలు పెట్టి లాభాలు చవి చూస్తున్న ఈ స్టయిలిష్ స్టార్ తాజాగా బీ-డబ్స్ వెంచర్ ను స్టార్ట్ చేసాడు. ఈ స్పోర్ట్స్ బార్ లో అల్లు అర్జున్ కు వ్యాపార భాగస్వామ్యం ఉందని.. పోస్టర్స్ ప్రింట్ చేయడం విశేషం.

loader