ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన బన్నీ నార్వే వెళ్లి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలసి యూరప్ వెళ్లారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన బన్నీ నార్వే వెళ్లి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలసి యూరప్ వెళ్లారు. బన్నీ గడ్డం ట్రిమ్ చేయడంతో చాలా రూమర్స్ వైరల్ అయ్యాయి. 

ముఖ్యంగా పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ సంతృప్తి కరంగా లేడని.. బన్నీ సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ రూమర్స్ మాత్రమే అని పుష్ప 2 చిత్ర యూనిట్ తేల్చేసింది. తదుపరి షెడ్యూల్ ప్రారంభం కావడానికి సమయం ఉండడంతో బన్నీ ఫ్యామిలీతో యూరప్ టూర్ వెళ్లారు. 

ప్రస్తుతం అల్లు అర్జున్ తన కొడుకు, కుమార్తె, సతీమణి అల్లు స్నేహతో కలసి నార్వేలో ప్రకృతి అందాలని ఆస్వాదిస్తున్నారు. ఆ దృశ్యాలని అల్లు స్నేహ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

నార్వేలోని పల్పిట్ రాక్ వద్ద బన్నీ ఫ్యామిలీతో లాంగ్ షాట్ లో ఇచ్చిన ఫోటో ఫోజు బావుంది. అల్లు స్నేహ తన ఫోటోలని కూడా షేర్ చేశారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.