అల్లు అర్జున్‌ కారు డ్రైవ్‌ చేస్తుండగా, ఆయన్ని వీడియోలో బంధించింది భార్య స్నేహారెడ్డి. దీన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో Allu Arjun కూతురు అల్లు అర్హ కూడా ఉండటం విశేషం. 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) షికారుకెళ్లాడు. ఇటీవల మాల్దీవుల్లో ఫ్యామిలీతో వెకేషన్‌ ఎంజాయ్‌ చేసిన వచ్చిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌ వీధుల్లో సరదాగా ఓ ట్రిప్పేశాడు. లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లాడు. అల్లు అర్జున్‌ కారు డ్రైవ్‌ చేస్తుండగా, ఆయన్ని వీడియోలో బంధించింది భార్య స్నేహారెడ్డి. దీన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో బన్నీ కూతురు అల్లు అర్హ కూడా ఉండటం విశేషం. అయితే ఆమె వెనకాల సీట్‌లో ఒంటరిగానే కూర్చొని ఫోన్‌లో గేమ్‌ ఆడుకుంటూ బిజీగా ఉండటం విశేషం. 

Scroll to load tweet…

 Allu Arjun లేటెస్ట్ పాపులర్‌ సాంగ్‌ని వింటూ డ్రైవింగ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. అఖిల్‌, పూజా హేగ్డే(Pooja Hegde) కలిసి నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలోని `గుచ్చే గులాబి లాగా..` అంటూ సాంగే మెలోడీని వింటూ బన్నీ డ్రైవ్‌ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుండటం విశేషం. దీన్ని బన్నీ అభిమానులు షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. అఖిల్‌ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రం దసరాకి విడుదలై విజయవంతంగా రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్‌ గెస్ట్ గా పాల్గొని సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌ Pushpa చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. రష్మిక మందన్నా(Rashmika Mandanna) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఇందులో బన్నీ.. ఎర్రచందనం దొంగగా కనిపించనున్నారట. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. పాత్రకి తగ్గట్టుగానే బన్నీ పూర్తి డీ గ్లామర్‌ పాత్రలో కనిపించనున్నారని, ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ తెలియజేస్తున్నాయి. 

also read: స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతున్న ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌` టీజర్‌కి ముందు స్వీట్‌ సర్‌ప్రైజ్‌లు

పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో భాగంగా డిసెంబర్‌ 17న తొలి భాగం రాబోతుంది. అందుకు సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేయబోతున్నారు మైత్రీమూవీ మేకర్స్ నిర్మాతలు. ఇక బన్నీ కూతురు అల్లు అర్హ నటిగా తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె `శాకుంతలం` చిత్రంలో బాల భరత పాత్రలో కనిపించబోతుంది. అల్లు అర్హ పాత్ర చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. సమంత ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

also read: మోకాళ్లపైకున్న పొట్టి డ్రెస్‌లో జాన్వీ కపూర్‌ పరువాల విందు.. విరహంతో కూడిన చిలిపి పోజులు చూడతరమా !