Asianet News TeluguAsianet News Telugu

కూతురి మాటలకు పొంగిపోతున్న అల్లు అర్జున్, వైరల్ అవుతున్న అల్లు అర్హ వీడియో

సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు స్టార్ కిడ్స్. స్టార్ హీరోలకు సమానంగా ఇమేజ్ ను సాధిస్తూ.. ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు. ఇక రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Allu Arjun Daughter Allu Arha Video Viral
Author
First Published Nov 21, 2022, 6:18 PM IST

స్టార్ హీరోలకు ఎంత క్రేజ్ ఉందో.. స్టార్ కిడ్స్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. పైగా ఎప్పటికప్పుడు తమ పిల్లల అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేసే మహేష్ బాబ, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల పిల్లలు ఇప్పుడు సెలబ్రిటీలుగా ట్రీట్ చేయబడుతున్నారు. ఈక్రమంలో వారు ఏ వీడియో చేసినా.. అది క్రేజీ రెస్పాన్స్ ను సాధిస్తుంది. రీసెంట్ గా అల్లు అర్హాకు సబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రేజ్ అంతా ఇంతా కాదు. మొన్నటి వరకూ  టాలీవుడ్ , మాలీవుడ్ కే పరిమితం అయిన ఆయన క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ తో పాటు..పాన్ ఇండియా రేంజ్ లో పెరిగిపోయింది. అంతే కాదు అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నెట్టింట్లో ఆయన కు మతిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బ‌న్నీ సోష‌ల్ మీడియాలో ఎంత ఫేమ‌స్ అయ్యారో.. ఆయన  గారాల ప‌ట్టి అల్లు అర్హ కూడా అంతే ఫేమ‌స్‌. ఇక నెట్టింట తండ్రీ కూతురు చేసే వీడియోలకు అన్నీ ఇన్నీ కాదవు. వాటికి వచ్చే రెస్పాన్స్ కూడా అంతా ఇంతా కాదు. 

ఇక వీరిద్దరికి సబందించిన ఎన్నో వీడియోలు ఫోటోలను..బన్నీ భార్య  అల్లు స్నేహ రెడ్డి తరచూ సోషల్‌ మీడియా లో షేర్ చేస్తూనే ఉంటుంది. ఆ వీడియోలునెట్టింట్లో అల్లు ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుంటాయి. ఫ్యాన్స్ ఈ వీడియోలు చూసిదిల్ ఖుష్ అవుతుంటారు. ముందు ముద్దు మాటలతో.. అల్లరి పనులతో.. ఎప్పటికప్పుడు నెట్టింట్లో సందడి చేస్తుంటుంది. రకరకాల వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది స్టార్ కిడ్. రీసెంట్ గా మరో వీడియోబన్నీ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. 

 

సోమవారం అల్లు అర్హ  6వ పుట్టినరోజు సందర్భంగా అల్లు ఫ్యామిలీ సంబరాల్లో తేలిపోతోంది.  ఈ సందర్భంగా తన ముద్దుకూతురు.. గారాల పట్టి అల్లు అర్హకి..అల్లు అర్జున్ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు అర్హకు సంబంధించిన ఓ క్యూట్‌ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియలోలో అల్లు అర్హ మాటలకు నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు. లైకులు శేర్ ల తో ఈ వీడియలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

ఇక ఈ వీడియోలో అర్హ..  వాళ్ల జుట్లులో కందిరీగలు దూరాయి.. కుడుతున్నాయ్‌.. అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ కనిపించింది. ఎక్కడా అంటే.. అక్కడా అంటూ అర్హా మాట్లాుడుతుంటే.. బన్నీ ముచ్చటపడుతూ.. ముద్దు చేస్తూ.. నవ్వుతూ.. కూతుర్ని గారాబం చేస్తున్న వీడియో తెగ తిరిగేస్తుంది. ఇది చూసిన నెటిజన్లు అర్హ మాటలకు ఫిదా అవుతున్నారు. అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రెటీస్ కూడా అర్హాను విష్ చేస్తున్నారు. 

అటు బన్నీ కూడా తన సినిమాలతో బిజీ కాబోతున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సాధించిన అల్లు అర్జున్.. పుష్ప 2 కోసం పక్కాగా ప్రిపేర్ అవుతున్నాడు ఇక ఈ సినిమా తరువాత ఆయన ఏ సినిమా చేయబోతున్నాడు అన్న విషయంపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios