Asianet News TeluguAsianet News Telugu

డబ్బింగ్ చెపుతున్న అల్లు అర్హ.. మురిసిపోతున్న అల్లు అర్జున్ వైరల్ అవుతున్న ఫోటో..

అల్లు అర్జున్ మురిసిపోతున్నాడు. తన కూతురు ఎంత ఎదిగిపోయిందో అంటూ సంతోషంలో తేలిపోతున్నాడు. తన సంతోషాన్ని వ్యాక్తం చేస్తేూ.. మచ్చక్కి ఓ ఫోటో షేర్ చేశాడు బన్నీ.

Allu Arjun Daughter Allu Arha starts dubbing For shaakuntalam movie
Author
First Published Jan 19, 2023, 8:53 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అంతకు మందే ఆమె సోషల్ మీడియా ద్వారా  చాలా పాపులర్ అయిన విషయం కూడా తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య అల్లు స్నేహ రెడ్డి కూడా అర్హకు సబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో శేర్ చేస్తుండేవారు. ఈక్రమంలోనే ఈ స్టార్ కిడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై మెరుపులు మెరిపించడానికి రెడీ అయ్యింది.శాకుంతలం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుంది అర్హా. ఈ క్రమంలో అర్హకు సబంధించిన అప్ డేట్స్ వరుసగా రిలీజ్ అవుతున్నాయి. 

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ క్యారెక్టర్ లో నటిస్తూ..గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా శాకకుంతలం.  పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథని శాకుంతలం సినిమాగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. అయితే  అర్హ ఈ సినిమాలో శకుంతల తనయుడు భరత రాజు చిన్నప్పటి  క్యారెక్టర్ వేసినట్టు సమాచారం. తాజాగా అర్హ  ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పింది. దానికి సంబంధించిన డబ్బింగ్ అర్హ ఇటీవల చెప్పగా స్నేహారెడ్డి దాన్ని ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోని అల్లు అర్జున తన స్టోరీలో కూడా షేర్ చేసి తన కూతురు డబ్బింగ్ చెప్తుందని మురిసిపోతున్నాడు. 

 దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. అటు  బన్నీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. శాకుంతలం సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్తుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. మరో పక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్, ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో అర్హ సింహంపై కూర్చొని రావడంతో.. సినిమాపై ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది ఆడియన్స్ లో. 


ఇక ట్రైలర్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. విజువల్ వండర్ లా అనిపించడంతో.. శాకుంతలం సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక శాకుంతలం సినిమాని ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో  రిలీజ్ చేయబోతున్నారు. అనారోగ్యంతో ఉండి కూడా సమంత ఈసినిమాకు డబ్బింగ్ చెప్పింది. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios