స్టార్ కిడ్ అల్లు అర్హ గురించి తెలిసిందే.. స్కూల్ కు వెళ్ళకముందే.. సినిమాలతో స్టార్ గా మారిన ఈ సెలబ్రిటీ చిన్నారి.. స్కూల్ కు వెళ్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు.. గారాలపట్టి అల్లు అర్హ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. చాలా చిన్నవయస్సులోనే సినిమాల్లోనటిస్తూ.. ఇప్పటి నుంచే టాలీవుడ్ లె స్టార్ డమ్ ను సంపాదించుకుంటుంది. అక్క అల్లు అయాన్ కంటే కూడా అల్లు అర్హానే ముందుగా సినిమాల్లోకి వచ్చింది. స్టార్ కిడ్ గా గుర్తింపు సాధించింది. ప్రస్తుతం వరుసగా ఆఫర్లు కూడా అందుకుంటుందట. ఈమధ్యే అల్లు అర్హం నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ అయ్యి.. పర్వాలేదు అనిపించింది. ఈమూవీలో.. బుల్లిభరతుడి పాత్రలో అల్లు అర్హా అద్భుతంగానటించి మెప్పించింది.
శాకుంతలంతో తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది అర్హా. అయితే స్కూల్ పాఠాకంటే ముందు సినిమాల పాఠాలు నుర్చుకున్న అల్లు అర్హ. తాజాగా.. బడి పాఠాలు నేర్చుకోవడానికి వెళ్తుంది. అవును అల్లు అర్హ స్కూల్ కు వెళ్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ‘ఫస్ట్ డే అఫ్ స్కూల్’ అంటూ ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. అందులో అర్హ తన అన్న అయాన్ చెయ్యి పట్టుకొని స్కూల్ లోకి వెళ్తున్న సీన్ కనిపిస్తుంది. ఫొటోలో అల్లు వారసులు ఇద్దరు ముచ్చటగా..ముద్దుగా.. ఉన్నారు. వెనుక్కి తిరిగి చూడకుండా స్కూల్ లోకి వెళ్లిపోయారు స్టార్ కిడ్స్.
అంతే కాదు ఈ పోటోలో మరో విశేషం ఏంటీ అంటే.. వారి స్కూల్ బ్యాగ్స్.. ఇద్దరి స్కూల్ బ్యాగ్స్ పై వారి వారి పేర్లు కనిపిస్తునాయి. . ఇక ఈ పిక్ చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ ముచ్చటపడిపోతున్నారు. అల్లు అర్హా బలే ముద్దుగా ఉంది అంటే కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అల్లు అభిమానులు. ఇక ప్రస్తుతం అల్లు అర్హాకువరుస ఆఫర్లు క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల కాంబోలో తెరకెక్కుతోన్న దేవర సినిమాలో కూడా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో అల్లు అర్హ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
దేవర సినిమాలో అల్లు అర్హ పాత్రపై కూడా రకరకాల ఊహాగాణాలు ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జాన్వీ చిన్నప్పటి పాత్రలో అర్హని చూపించేందుకు మూవీ టీం అల్లు అర్జున్ ని సంప్రదించారట. బన్నీ కూడా ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. మరి వీటిలో ఎంతవరకు నిజముందో తెలియదు. అటు అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆతరువాత త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్.