అల్లు అర్జున్‌, అల్లు స్నేహారెడ్డిలు నేడు మ్యారేజ్‌ యానివర్సరీ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భార్యకి బన్నీ తెలిపిన విషెస్‌ వైరల్‌ అవుతుంది.  

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప 2`లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. బన్నీ ఉంటే సినిమా షూటింగ్‌లు, లేదంటే ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తుంటాడు. సరదాగా గడుపుతుంటాడు. తరచూ తన కూతురు, కుమారుడి ఫోటోలను, వీడియోలను పంచుకుంటాడు. 

ఇక ఐల్లు అర్జున్‌, ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తమ మధ్య ప్రేమని సందర్భం వచ్చిన ప్రతిసారి బన్నీ వెల్లడిస్తారు. నేడు బన్నీ, స్నేహారెడ్డిల మ్యారేజ్‌ యానివర్సరీ. తమ వివాహ బంధం 13ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన భార్య స్నేహారెడ్డికి క్యూట్‌గా విషెస్‌ తెలిపారు బన్నీ. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 

ఇందులో బన్నీ చెబుతూ, పెళ్లై 13ఏళ్లు అయ్యింది. నేను ఇలా ఉండటానికి నీతో బంధమే కారణం. నీ ప్రశాంతమైన మనసు నుంచి నాకు ఎంతో శక్తిని ఇచ్చావు. ఇలానే మరెన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నా` అంటూ హ్యాపీ యానివర్సరీ క్యూటీ అంటూ బన్నీ పోస్ట్ పెట్టారు. భార్యతో కలిసి దిగిన ఫోటోని, అలాగే పెళ్లినాటి ఫోటోని పంచుకున్నారు ఐకాన్‌ స్టార్‌. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ విషెస్‌ తెలియజేస్తున్నారు, అన్న, వదిలకు మ్యారేజ్‌ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

అల్లు అర్జున్‌, స్నేహారెడ్డితో 2011 మార్చి 6లో వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంవిశేషం. వీరికి కుమారుడు అల్లు అయాన్‌, కూతురు అల్లు అర్హ జన్మించారు. అల్లు అర్హా.. `శాకుంతలం` సినిమాలో బాలనటిగా మెరిసిన విషయం తెలిసిందే. ఇక అల్లు స్నేహారెడ్డి సోష్‌ల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన వర్కౌట్‌ వీడియోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అలాగే సేవా, వ్యాపార కార్యక్రమాల్లోకి కూడా ఎంటర్‌ అవుతున్నారు. 

Scroll to load tweet…

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ నెల 8 నుంచి వైజాగ్‌లో కొత్త షెడ్యూల్‌ని ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సినిమాని ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నారు. 

Read more: #Pushpa2: ‘పుష్ప2’ కి పోటీ ఏమో కానీ ఇరుకున అయితే పెడతారు ?