జాతీయ ఉత్తమ నటుడికి సంబంధించిన జాతీయ అవార్డుల్లో ఇప్పటి వరకు ఏ తెలుగు నటుడు అవార్డు పొందలేదు. తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్‌ కావడం విశేషం. 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రికార్డు క్రియేట్‌ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు సాధ్యం కాని రికార్డుని క్రియేట్‌ చేశారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడికి సంబంధించిన జాతీయ అవార్డుల్లో ఇప్పటి వరకు ఏ తెలుగు నటుడు అవార్డు పొందలేదు. తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్‌ కావడం విశేషం. ఇలా బన్నీ తెలుగు సినిమా రికార్డులు బ్రేక్‌ చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్‌ చేశారు. ఎన్టీఆర్‌ తరం నుంచి ఇప్పటి వరకు ఏ నటుడికీ సాధ్యం కానిది తాను చేసి చూపించారు. తెలుగు సినిమా గౌరవాన్ని మరింత పెంచారు. 

నేషనల్‌ అవార్డుల్లో 1967 నుంచి ఉత్తమ నటుడి విభాగంలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను అందిస్తుంది. ఇందులో ఎక్కువగా హిందీ, మలయాళం, తమిళ నటులు జాతీయ అవార్డులను అందుకున్నారు. బెంగాలీ, కన్నడ, మరాఠి నటులు కూడా ఉన్నారు. కానీ తెలుగు నుంచి, తెలుగు సినిమాలకు ప్రాతినిధ్యం వహించే విషయంలో ఇప్పటి వరకు ఒక్కరుకూడా జాతీయ అవార్డు దక్కించుకోకపోవడం విచారకరం. దాన్ని బ్రేక్‌ చేశారు బన్నీ. సరికొత్త సంచలనం సృష్టించారు. 

అల్లు అర్జున్‌ `పుష్ప` చిత్రానికిగానూ బెస్ట్ యాక్టర్‌గా అవార్దుకి ఎంపికయ్యారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. 2021 డిసెంబర్‌ 17న ఈ సినిమా విడుదలైంది. ఇందులో పుష్పరాజ్‌గా బన్నీ నటించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రంలో బన్నీ పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లో నటించారు. ఆయనకు జోడీగా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా నటించింది. ఇందులో సమంత స్పెషల్‌ సాంగ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట ఇండియానే కాదు, గ్లోబల్‌ వైడ్‌గానూ ఊపేసింది. అలాగే `శ్రీవల్లి` పాటసైతం దుమ్ములేపింది. 

సినిమా విడుదలైనప్పుడు మిశ్రమ స్పందన లభించింది. కానీ నెమ్మదిగా పుంజుకుంది. ఏపీలో టికెట్‌ రేట్లు తక్కువగా ఉన్నా కూడా ఈ చిత్రం ఏకంగా రూ.350కోట్లు సాధించింది. మూడు గంటల సినిమా అనే టాక్‌ కూడా వచ్చింది. కానీ వాటన్నింటిని పటా పంచల్‌ చేసి కంటెంట్‌ ఉంటే నిడివి సమస్య కాదని నిరూపించింది. రిలీజ్‌ టైమ్‌లో సినిమా అవార్డుల, రివార్డులు గెలుచుకుంటుందని బన్నీ చెప్పారు. ఇప్పుడు అదే నిజమైంది. రెండు జాతీయ అవార్డులు రావడం విశేషం. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌కి కూడా నేషనల్‌ అవార్డు వరించిన విషయం తెలిసిందే.

మరోవైపు ఆరు అవార్డులు `ఆర్‌ఆర్‌ఆర్‌` సరికొత్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 69వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ సాయంత్రం కేంద్ర సామాచార మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. 2021-2022 ప్రారంభం వరకు విడుదలైన సినిమాలకు ఈ జాతీయ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో తెలుగు సినిమా సత్తా చాటింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి టాలీవుడ్‌ జాతీయ అవార్డుల్లో విజయకేతనం ఎగరవేసింది.