Asianet News TeluguAsianet News Telugu

Allu Arjun:పాకిస్థాన్ లో అల్లు అర్జున్ హవా.. పుష్ప రాజ్ కోసం దాయాదీల ఎదురుచూపులు..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్.. టాలీవుడ్ దాటి.. బాలీవుడ్ దాటి..  ఆ దేశం.. ఈ దేశం కాదు... మన దాయాదీ దేశం పాకిస్తాన్ కు కూడా చేరింది. బన్నీ అంటే పడి చచ్చిపోతున్నారట జనాలు. 

Allu Arjun Craze In pakistan waiting for Pushpa Sequel Movie JMS
Author
First Published Nov 16, 2023, 11:24 AM IST


అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పన్నకర్లేదు. టాలీవుడ్ కే పరిమితం అయిన ఆక్రేజ్ పుష్ప సినిమాతో పాన్ ఇండియాకు చేరింది. పార్ఇండియా కు మాత్రమే పరిమితం అవ్వకుండా.. ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాలల్లో బన్నీ పాటలకు రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాను శేక్ చేశారు. ఇక అల్లు అర్జున్ క్రేజ్.. ఆ దేశం.. ఈ దేశం కాదు... మన దాయాదీ దేశం పాకిస్తాన్ కు కూడా చేరింది. బన్నీ అంటే పడి చచ్చిపోతున్నారట జనాలు. అల్లు సినిమాలకు ముధ్గులు అవుతున్నారట. 


అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప కు ముందు పుష్ప తరువాత అనేది చెప్పాలి. దేశ వ్యాప్తంగా పాపులారీటీ వచ్చిన హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. మన టాలీవుడ్ నుండి ఇతర రాష్ట్రాల్లో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ 3 హీరోల లిస్ట్ తీస్తే అందులో అల్లు అర్జున్ పేరు ముందు వరుసలో ఉంటుంది. రాజమౌళి తర్వాత ఇతర రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ బ్రాండ్ ఏదైనా ఉందా అంటే అది అల్లు అర్జున్ బ్రాండ్ మాత్రమే. ఈ బ్రాండ్ ఇమేజి ఆయనకీ పుష్ప సినిమాతో వచ్చింది అనుకుంటే పొరపాటే.

బన్నీకి కేరళ లాంటి రాష్ట్రాల్లో స్టార్ హీరో ఇమేజ్ ఉంది. ఆర్య 2  మూవీ నుంచి  అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన హిందీ డబ్బింగ్ సినిమాలకు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఎప్పుడైతే  పుష్ప సినిమా వచ్చిందో.. అప్పటి నుంచి బన్నీకి నార్త్ లో మార్కెట్ బీభత్సంగా పెరిగిపోయింది. స్టార్ హీరోలకు సమానమైన క్రేజ్ వచ్చి పడింది. ఇండియా లోనే కాదు, అల్లు అర్జున్ కి పాకిస్థాన్ మరియు బాంగ్లాదేశ్ వంటి ప్రాంతాలలో కూడా మంచి క్రేజ్ ఉంది. 

పాయల్ చెవిలో అల్లు అర్జున్ చెప్పింది ఇదా! రివీల్ చేసిన యంగ్ బ్యూటీ

మరీ ముఖ్యంగా  పాకిస్థాన్ లో అయితే బాలీవుడ్ హీరోల తర్వాత అత్యంత క్రేజ్ అల్లు అర్జున్ కు మాత్రమే ఉంది అంటున్నారు. బీ టౌన్ హీరోలకు పోటీగా బన్నీ సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్నాయని వినికిడి. మరీ ముఖ్యంగా పుష్ప రాజ్ వారికి బాగా నచ్చాడట. ఈ సినిమాను అక్కడి జనాలు బాగా ప్రేమించారని సమాచారం. పుష్ప సినిమా తెగ నచ్చేసినట్టు సమాచారం. 

పుష్ప సినిమా పాకిస్థాన్ లో..  దాదాపుగా 12 కోట్ల  గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట. ఇది సాధారమైన విషయం కాదు, ప్రస్తుతం అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న పుష్ప’ సీక్వెల్  పుష్ప ది రూల్ కోసం పాకిస్థానీ ఆడియన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తుననట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీ అంతకు మించి తెరకెక్కించబోతున్నారు టీమ్ నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప2తో అక్కడ ఎలాంటి క్రేజ్ సాధిస్తాడో చూడాలి. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ జోరుగా సాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios