Asianet News TeluguAsianet News Telugu

Payal Rajput : పాయల్ చెవిలో అల్లు అర్జున్ చెప్పింది ఇదా! రివీల్ చేసిన యంగ్ బ్యూటీ

‘మంగళవారం’ చిత్రంతో పాయల్ రాజ్ పుత్ మళ్లీ సెన్సేషన్ గా మారింది. దీంతో ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన బన్నీ పాయల్ తో స్వయంగా ఆ మాటలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ బన్నీ ఏమన్నాడంటే.. 
 

Allu Arjun About Payal Rajput role in Mangalavaaram NSK
Author
First Published Nov 15, 2023, 7:16 PM IST

'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput).  టాలీవుడ్ కు ఆమెను పరిచయం చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలోనే మళ్ళీ ఆమె నటించిన చిత్రం  'మంగళవారం' (Mangalavaaram).  ఈ సినిమా రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రచార కార్యక్రమాలను మరింత జోరుగా నిర్వహిస్తున్నారు. 

తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన పాయల్ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పింది. ఇటీవల జరిగిన ‘మంగళవారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జాతీయ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాయల్ బన్నీతో సెల్ఫీలు దిగింది. ఈ సమయంలో ఆమెతో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ కనిపించారు. ఆ సమయంలో పాయల్ వినయంగా కనిపించింది. 

ఇంతకీ బన్నీ తనకు ఏం చేప్పారో తాజాగా పాయల్ రివీల్ చేసింది.  స్టేజీపైనే అల్లు అర్జున్ మంగళవారంలో తను నటించిన పాత్రపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపింది. ఆయనను కలవడం సంతోషకరమైన విషయమైతే.. ఐకాన్ స్టార్ మాటలు మరింత జోష్ నిచ్చాయని చెప్పుకొచ్చింది. 'పాయల్... నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నాకు తెలుసు. ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదు' అని చెప్పారు. నిజంగా ఇలాంటి పాత్రల్లో నటించడం అంతా ఈజీ కాదని పాయల్ మరోసారి చెప్పుకొచ్చింది. మొత్తానికి బన్నీ అలా చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయినట్టు చెప్పింది.

పాయల్ బోల్డ్ పోస్టర్లు, బోల్డ్ సన్నివేశాలతో సినిమాపై ఎంతటి బజ్ క్రియేట్ అయ్యిందో తెలిసిందే. మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా హిట్ కొట్టడం ఖాయమని పాయల్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమెకు జోడీగా 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ నటించారు. అజయ్ భూపతికి చెందిన 'ఏ' క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి స్వాతి రెడ్డి గునుపాటి నిర్మించిన చిత్రమిది. నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదలవుతోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios