Asianet News TeluguAsianet News Telugu

పిల్లల కోసం ఆ అలవాటు మార్చుకున్న అల్లు అర్జున్..? పెళ్లి తరువాత బన్నీ మారిపోయారా..?

అల్లు అర్జున్ తనను తానుమార్చుకున్నారా..? ఇంతకు ముందు ఉన్న బన్నీ వేరు.. ఇప్పుడు ఉన్న బన్నీ వేరేనా..? పెళ్లి పిల్లలు ఆయనలో మార్పును తీసుకువచ్చిందా..?  బన్నీ గురించి వైరల్అవుతున్నవార్తల్లో నిజంఎంత..? 

Allu Arjun Change His Life Styil After Marraige and Children  JMS
Author
First Published Nov 17, 2023, 8:05 AM IST | Last Updated Nov 17, 2023, 8:35 AM IST

అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్.. నేషనల్ అవార్డ్ విన్నర్.. గ్లొబల్ స్టార్ గా మారడానికిచాలా దగ్గరలో ఉన్నాడు. ఇప్పటికే గ్లొబల్ ఇమేజ్ ను పుప్ప సినిమాతో కాస్త టచ్ చేసి వచ్చాడు. ఇక పుష్ప సీక్వెల్ తో.. ఆస్కార్ పై గురిపెట్టాడు బన్నీ. ప్రస్తుతం  పుష్ప సీక్వెల్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. నెక్ట్స్ ఇయర్ అగస్ట్ లో ఈమూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ నుంచి ఈసినిమా సంచలనంగా మారుతుందని భావిస్తున్నారు. 

పాకిస్థాన్ లో అల్లు అర్జున్ హవా.. పుష్ప రాజ్ కోసం దాయాదీల ఎదురుచూపులు..

ఇది ఇలా ఉంటే..పుష్ప సినిమాతో నేషనల్ అవార్డ్ సాధించి.. టాలీవుడ్ పేరు నిలబెట్టాడు బన్నీ. ఉత్తమ కథానాయకుడు కెటగిరీలో తెలుగు పరిశ్రమకు ఇంత వరకూ ఈ అవార్డ్ దక్కలేదు. అల్లు అర్జున్ సాధించి.. చరిత్ర సృష్టించాడు.  ఇక ఈక్రమంలో అల్లు అర్జున్ కు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ బ్యాచిలర్ గా ఉన్నప్పుడు కోపంగా ఉండేవాడట. అంతే కాదు కాస్త ఘాటుగా మాట్లాడేవాడట. అందులో బూతులు కూడా ఉండేవట.  ఆతరువాత తనను తాను మార్చుకున్నాడట అల్లు అర్జున్. 

Allu Arjun Change His Life Styil After Marraige and Children  JMS

మరీ ముఖ్యంగా పెళ్ళి తరువాత తనలో మార్పు వచ్చిందంటున్నారు. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్ళాడిన తరువాత అల్లు అర్జున్ భాషలో మార్పు వచ్చిందట. బూతులు తగ్గించేశాడట.  అంతే కాదు కోపం కూడా తగ్గిందంటూన్నారు. ఇక అయాన్ , అర్హ ఫుట్టిన తరువాత బన్నీ కంప్లీట్ గా మారిపోయారట. కోపం కంప్లీట్ గా తగ్గిపోవడంతో పాటు.. ఎక్కడ లేని ఓపిక వచ్చేసిందట. ఇక బూతులు మాట్లాడటం మర్చిపోయారట అల్లు అర్జున్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే.. అల్లు అర్జున్ తన లైఫ్ స్టైల్ ను పెళ్లి పిల్లల తరువాత కంప్లీట్ గా మార్చేశారు. 

ఇక బన్నీ వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. పుష్ప తరువాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో నెక్ట్స్ సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం సందీప్.. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాడు. రణ్ బీర్ కపూర్ తో ఆనిమల్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈసినిమా తరువాత బన్నీతో మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. పుష్ప2 తో గ్లోబల్ స్టార్ గా మారాలి అనుకుంటునన అల్లు అర్జున్ తో.. ఇప్పటికే బాలవుడ్ లో సినిమాలు చేయడానికి దర్శకులు రెడీ అవుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios