Asianet News TeluguAsianet News Telugu

మరో సెన్సేషన్‌.. బ్రేకుల్లేని బుట్టబొమ్మ!

అల్లు అర్జున్‌ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం రికార్డుల దిశగా వెళ్తుంది. ఈ సినిమా విడుదలై ఎనిమిది నెలలు కావస్తున్నా, ఇంకా సందడి మాత్రం తగ్గడం లేదు. సినిమా కలెక్షన్ల పరంగా టాలీవుడ్‌లో  నాన్‌ `బాహుబలి` రికార్డులను క్రియేట్‌ చేస్తే, ఇక పాటలు సెన్సేషనల్‌ అవుతున్నాయి

allu arjun Butta Bomma song creat new records
Author
Hyderabad, First Published Aug 2, 2020, 10:19 AM IST

అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన `అల వైకుంఠపురములో` చిత్రం రికార్డుల దిశగా వెళ్తుంది. ఈ సినిమా విడుదలై ఎనిమిది నెలలు కావస్తున్నా, ఇంకా సందడి మాత్రం తగ్గడం లేదు. సినిమా కలెక్షన్ల పరంగా టాలీవుడ్‌లో  నాన్‌ `బాహుబలి` రికార్డులను క్రియేట్‌ చేస్తే, ఇక పాటలు సెన్సేషనల్‌ అవుతున్నాయి. ఇందులోని పాటలు వంది మిలియన్‌ వ్యూస్‌ దాటి రెండు వందల మిలియన్‌ వ్యూస్‌ దిశగా దూసుకుపోతున్నాయి. 

అందులో `బుట్టబొమ్మ` సాంగ్‌ మాత్రం సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఇది తాజాగా మూడు వందల మిలియన్‌ వ్యూస్‌ని రాబట్టుకుంది. అంటే దీన్ని ఇప్పటి వరకు ముప్పై కోట్ల మంది వీక్షించారు. అత్యంత వేగంగా ఓ తెలుగు పాటని ఇంత మంది వీక్షించడం ఇదే తొలిసారి. అలాగే టాలీవుడ్‌ సినీ చరిత్రలోనే ఓ పాటని ఇంత మంది చూడటం కూడా సంచలనమే. దీంతో `బుట్టబొమ్మ` న్యూ రికార్డ్ క్రియేట్‌ చేసింది. ఈ విషయాన్ని మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ తన హ్యాపీనెస్‌ని షేర్‌ చేసుకున్నారు. 

ఇక ఇందులోని `సామజవరగమన..`, `రాములో రాములా.. ` పాటలు ఎంతగా ఆదరణ పొందాయో తెలిసిందే. థమన్‌ కెరీర్‌లోనే `అల వైకుంఠపురములో` ది బెస్ట్ ఆల్బమ్‌గా నిలుస్తుందని ఆయన ఇప్పటికే చెప్పారు. తాజాగా ఈ పాటలు దాన్ని మించి ఆదరణ పొందుతుండటం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios