ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓ ప్రక్కన సుకుమార్, మరో ప్రక్క వేణు శ్రీరామ్ స్క్రిప్టులు రెడీ చేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే వీళ్ళద్దరికి ట్విస్ట్ ఇస్తూ బన్ని మరో ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించబోతున్నారు. ఈ సినిమాని తమ సొంత బ్యానర్ లో తండ్రి అల్లు అరవింద్ నిర్మాణంలో చేయనున్నారు. ఇంతకీ కొత్తగా సీన్ లోకి వచ్చిన డైరక్టర్ ఎవరూ అంటే..

 సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాకు దర్శకుడు బోయపాటి శ్రీను.  డిసెంబర్ మొదటి వారం నుండి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్లు  తెలుస్తోంది. ప్రస్తుతం  త్రివిక్రమ్ చేయబోతున్న సినిమా టాకీ పార్ట్ ను నవంబర్ కల్లా పూర్తి చేయనున్నారట. ఆ తర్వాత ఈ సినిమా మొదలెట్టనున్నారు. 
 
 గతంలో బోయపాటి – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘సరైనోడు’ సినిమా సూపర్ హిట్ అవ్వటమే ఈ ప్రాజెక్టు ప్రారంభమవటానికి కారణమని చెప్తున్నారు. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ సైతం హై సక్సెస్ అయ్యింది. దాంతో ఈ సారి కూడా ఈ క్రేజీ కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుందని ఎదురుచూస్తున్నారు. మరి సుకుమార్ సినిమా కూడా రీసెంట్ గానే మొదవుతుందని చెప్తున్నారు. ఎలా డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తారో చూడాలి.