బాలీవుడ్ లో మన స్టార్ హీరోలు క్లిక్కవ్వడమనేది అంత ఈజీ కాదు. కానీ కాలం మారుతోంది కాబట్టి కమర్షియల్ గా కాకుండా స్టార్ హీరోలు వేసే కొత్త అడుగులు ఎవరికైనా నచ్చుతాయని కొన్ని విషయాల్ని చూస్తుంటే అర్ధమవుతోంది. బాహుబలి సక్సెస్ తో ప్రభాస్ అక్కడ బాగానే క్లిక్కయ్యాడు. కానీ గతంలో ఛాలా మంది హీరోలు మొదటి సినిమాలతోనే దెబ్బ తినాల్సి వచ్చింది.

అసలు మ్యాటర్ లోకి వెళితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. రీసెంట్ గా బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ అద్వానీ పార్టీకి స్టైలిష్ స్టార్ హాజరుకావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. చాలా వరకు బన్నీని బాలీవుడ్ టెక్నీషియన్స్ ఇష్టపడతారు. 

బన్నీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని అక్కడి స్టార్ హీరో హీరోయిన్స్ చెబుతూనే ఉంటారు. పైగా నార్త్ ఆడియెన్స్ కి బన్నీ హిందీ డబ్బింగ్ సినిమాలంటే చాలా ఇష్టం. దీంతో మంచి కథ సెట్టయితే బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వాలని బన్నీ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బాట్ల దర్శకుడు అమిత్ తో బన్నీ టచ్ లో ఉంటున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.