నేడు అల్లు అర్జున్ తన 40వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. బన్నీ బర్త్ డే కావడంతో అభిమానులు సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.
నేడు అల్లు అర్జున్ తన 40వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. బన్నీ బర్త్ డే కావడంతో అభిమానులు సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. దీనితో అల్లు అర్జున్ బర్త్ డే కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ వైరల్ గా మారాయి.
అల్లు అర్జున్ తన 40వ జన్మదిన వేడుకల్ని ప్రత్యేకంగా మార్చుకున్నాడు. బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం బన్నీ తన ఫ్యామిలీ, 50 మంది క్లోజ్ ఫ్రెండ్స్ తో కలసి సెర్బియా వెళ్ళాడు. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ లో బన్నీ అండ్ కో కంప్లీట్ పార్టీ మూడ్ లోకి వెళ్లారు. బాగా చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ సహజంగానే సినిమాల నుంచి విశ్రాంతి లభించినప్పుడు ఎక్కువగా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. అల్లు అర్జున్ ఎక్కువగా పిల్లలతో సమయం గడుపుతూ సెలెబ్రేషన్స్ మూడ్ లో ఉంటాడు.

2003లో అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బన్నీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రతి చిత్రంలో అద్భుతమైన నటనతో ప్రత్యేకత చాటుతూ వస్తున్నాడు.

ఆర్య, బన్నీ, సరైనోడు, రేసుగుర్రం, అల వైకుంఠపురములో, జులాయి, పుష్ప లాంటి భారీ విజయాలు ఉన్నాయి. ఈ ఏడాది అల్లు అర్జున్ పుష్ప 2లో నటించబోతున్నాడు. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా క్రేజ్ లభించింది.
