ఓ వైపు ప్రొడక్షన్.. మరోవైపు వెబ్ సిరీస్.. బన్నీ ప్లానేంటి?
అవును.. త్వరలో బన్నీ నిర్మాతగా మారబోతున్నారని టాక్. ఇప్పటికే తన తండ్రి అల్లు అరవింద్ `గీతాఆర్ట్స్` పేరుతో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కానీ బన్నీ తన పేరుతో ఓ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నారట.
డబ్బు మనిషిని ఏదైనా చేయిస్తుంది. ముఖ్యంగా బిజినెస్‌ని మాత్రం బాగానే చేయిస్తుంది. టాలీవుడ్ స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్‌ని సైతం ఇప్పుడు వ్యాపారిగా మారుస్తుంది. కాకపోతే సినిమా వ్యాపారి. అదేనండి నిర్మాతని చేయబోతుంది. అవును.. త్వరలో బన్నీ నిర్మాతగా మారబోతున్నారని టాక్. ఇప్పటికే తన తండ్రి అల్లు అరవింద్ `గీతాఆర్ట్స్` పేరుతో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కానీ బన్నీ తన పేరుతో ఓ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నారట.
నిజానికి చాలా రోజులుగా బన్నీ ప్రొడక్షన్ కంపెనీని లాంచ్ చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. కానీ దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఆయన నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం భారీ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో, ఆయన పారితోషికం అమాంతం పెరిగింది. దీంతో ఇక ప్రొడక్షన్‌ని స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కథలను వింటున్నారని, అందులో ఫస్ట్ ఓ వెబ్ సిరీస్‌ని నిర్మించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇందులో నిర్మాతగా తన పేరు వేసుకుంటారా? మరెవరిదైనా వేస్తారా? అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉందట.
ఇదిలా ఉంటే ఇటీవల అల్లు ఫ్యామిలీ కలిసి ఓ స్టూడియోని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఆ మధ్యనే దాన్ని హైదరాబాద్ శివారు ప్రాంతంలో ప్రారంభించారు. నెమ్మదిగా మిగిలిన వ్యాపారాల్లోకి కూడా దిగాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్. లాక్ డౌన్ తర్వాత త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుంది. దీంతోపాటు కొరటాలశివ డైరెక్షన్‌లో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బన్నీ.