ముంబయ్ ఏయిర్ పోర్ట్ లో అల్లు అర్జున్, అట్లీతో సినిమాఫిక్స్ అయినట్టేనా...?
తాజాగా ముంబయ్ ఏయిర్ పోర్ట్ లో సందడి చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఆయన ముంబయ్ లో సందడి చేయడంపై రకరాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంతకీ బన్నీ ముంబయ్ ఎందుకు వెళ్లినట్టు.

తాజాగా ముంబయ్ ఏయిర్ పోర్ట్ లో సందడి చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఆయన ముంబయ్ లో సందడి చేయడంపై రకరాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంతకీ బన్నీ ముంబయ్ ఎందుకు వెళ్లినట్టు.
ఐకాన్ స్టార్ ముంబయిలో సందడి చేశారు. ఆయన ముంబయ్ పర్యటన సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఏయిర్ పోర్ట్ లో బన్నీ సందడి చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అయితే ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీని కలిసేందుకే ముంబైకి బన్నీ వెళ్లాడని ఫిల్మ్ నగర్ లో గట్టిగా టాక్ వినిపిస్తుంది. బన్నీ ముంటై ట్రిప్ వివరాలు అధికారికంగా మాత్రం వెల్లడి కాలేదు. అట్లీని కలిసి సినిమాను ఫిక్స్ చేసుకున్నారు అని రూమర్ గట్టిగా వినిపిస్తోంది.
అయితే అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్ లోకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అట్లీ కథకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.. లేదా. బన్నీ నెక్ట్స్ సినిమా ఆయనతోనే ఉంటుందా..? ఉంటే అధికారిక అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఇస్తారు అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక అట్లీ విషయానికి వస్తే.. ఆయన తాజా చిత్రం జవాన్ ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ బాద్ షా ..షారుఖ్ ఖాన్ తో నయనతార హీరోయిన్ గా.. అనిరుధ్ మ్యూజిక్ కాంబినేషన్ తో.. బాలీవుడ్ షాక్ అయ్యేలా సినిమాను తెరకెక్కించాడు అట్లీ.
ఇక జవాన్ మూవీ బాక్సాఫీస్ ను శేక్ చేసింది. దాదాపు 1000 కోట్ల కలెక్షన్ మార్క్ కు చాలా దగ్గరలో ఉంది. బన్నీ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సాధించాడు. పుష్ప2 సినిమాతో 1000 కోట్ల కలెక్షన్స్ తో పాటు.. ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా టార్గెట్ గా దూసుకుపోతున్నాడు. అందుకే పుష్ప సీక్వెల్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలో జవాన్ తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సాధించిన అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేస్తే.. అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం కష్టం.
అయితే ఇప్పటికే అల్లు అర్జున్ కోసం ఓ కథను రాశాడట అట్లీ.. టాలీవుడ్ లో మరికొందరు హీరోలతో అట్లీ సినిమాలు చేస్తాడు అన్న రూమర్ ఉంది. అయితే ఆయన ముందు లైన్ లో పెట్టబోయోదు మాత్రం బన్నీనే అని తెలుస్తోంది. ఈక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబయ్ పర్యటన హాట్ టాపక్ గా మారింది. మరి ఇదే నిజం అయితే.. అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.