`జాతిరత్నాలు` చిత్రంపై స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించారు. సినిమా హిలేరియస్‌గా నవ్వించిందన్నారు. రాత్రి ఆయన సినిమాని చూశానని, అద్భుతమైన కామెడీ చిత్రమన్నారు. ఈ మేరకు అల్లు అర్జున్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు.

సక్సెస్‌ టాక్‌తో దూసుకుపోతున్న `జాతిరత్నాలు` చిత్రానికి స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించారు. సినిమా హిలేరియస్‌గా నవ్వించిందన్నారు. రాత్రి ఆయన సినిమాని చూశానని, అద్భుతమైన కామెడీ చిత్రమన్నారు. ఈ మేరకు అల్లు అర్జున్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు. `లాస్ట్ నైట్‌ `జాతిరత్నాలు` సినిమా చూశా. టీమ్‌ అందరికి నా అభినందనలు. హిలేరియస్‌ చిత్రమిది. ఇటీవల కాలంలో నేను ఇంతగా ఎప్పుడూ నవ్వలేదన్నారు. 

`నవీన్‌ పొలిశెట్టి స్టెల్లర్‌ పర్‌ఫెర్మెన్స్ చూపించారు. కొత్తరకమైన నటనని ప్రదర్శించారు. రాహుల్‌ రామకృష్ణ ఏమాత్రం ఎఫర్ట్ లేకుండా బ్రిలియంట్‌గా నటించారు. ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా బాగా చేశారు. రథన్‌ సంగీతం అద్భుతం. ఇతర టెక్నీషియన్లు కూడా బాగాచేశారు. ఈ చిత్ర నిర్మాతలు నాగ్‌ అశ్విన్‌, స్వప్న, ప్రియాంక దత్‌, అశ్వినీదత్‌లకు అభినందనలు. ఈ సినిమాని నమ్మినందుకు. ప్రతి ఒక్కరిని ఎంటర్‌టైన్‌ చేసిన చిత్ర దర్శకుడు అనుదీప్‌పై గౌరవం పెరిగింది. ప్రతి ఒక్కరు బ్రెయిన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి సినిమాని, ఫన్‌ని ఎంజాయ్‌ చేయండి` అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…