Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ సినిమాని చెత్త చేసేస్తున్నారా...తిట్టిపోస్తున్నారు

హీరోయిన్‌, హీరో మధ్య కెమిస్ట్రీ మాత్రం అంతగా కుదిరినట్టు అనిపించడం లేదు. మరీ ముఖ్యంగా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అతిపెద్ద మైనస్‌లా కనిపిస్తోంది. 

Allu Arjun Ala Vaikuntapurramulo  Film Getting Ruined
Author
First Published Nov 23, 2022, 11:25 AM IST


ఒక భాషలో హిట్టైన సినిమాను రీమేక్ చేయటం అంత ఈజీ కాదు. మక్కీకి మక్కీ  తీయటానికి ఉండదు. నేటివిటి సమస్యలు వస్తాయి. అయితే వాటిని అధిగమిస్తూ చేసిన సినిమాలు సూపర్ హిట్టైనవి ఉన్నాయి. అలాగే నేటివిటి, ట్రెండ్ పేరిట తమ ఇష్టాను సారం కథ,కథనాలు మారుస్తూ చేసే సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. తాజాగా అలవైకుంఠపురములో చిత్రం హిందీ రీమేక్ చేస్తున్నారు. తెలుగులో పెద్ద హిట్టైన ఈ చిత్రం హిందీ వెర్షన్ Shehzada టీజర్ రిలీజైంది. ఆ టీజర్ చాలా దారుణంగా ఉందని అందరూ అంటున్నారు. విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఒరిజనల్ చూసిన వాళ్లు సోషల్ మీడియాలో తిట్టి పోస్తున్నారు.
 
 వివరాల్లోకి వెళితే..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా పెద్ద హిట్టైంది. ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. దాంతో పై బన్నీ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. హిందీతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు స్దాయిలో  ‘అల వైకుంఠపురములో’ హిందీ సినిమా  ఉర్రూతలూగిస్తుందా లేదా చూడాలి. ప్రస్తుతం అయితే  టీజర్‌ను తీసుకొచ్చారు.

ఇప్పుడు కార్తీక్ ఆర్యాన్ బర్త్ డే సందర్భంగా ఈ రీమేక్ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగా టీజర్‌లోని ప్రతీ షాట్‌ను నెటిజన్లు ఒరిజినల్‌తో పోల్చుతున్నారు.
అయితే ఒరిజినల్‌లో ఉన్న ఫీల్, బన్నీలోని స్టైల్, యాటిట్యూడ్, ఆ కొత్తదనం మాత్రం రీమేక్‌లో కనిపించడం లేదు. ఈ మేరకు నెటిజన్లు కూడా కార్తీక్ ఆర్యాన్‌ను చూసి పెదవి విరుస్తున్నారు.అసలు రీమేక్ చేయకుండా ఉండాల్సింది కదా? అంటున్నారు.

అలాగే సిత్తరాల సిరపడు టైంలో వచ్చిన సీన్లను రీమేక్‌లో రైల్వే స్టేషన్‌లో పెట్టారు. ఇంట్లోకి మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చే సీన్‌ కూడా దారుణంగా ఉంది. ఫస్ట్ ఫైట్‌ తెలుగులో ఎంత స్టైలీష్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. పోర్ట్ ఏరియాలో ఉండే ఫైట్‌ను మాత్రం ఉన్నది ఉన్నట్టుగా తీసినట్టు కనిపిస్తోంది. ఇక హీరోయిన్‌, హీరో మధ్య కెమిస్ట్రీ మాత్రం అంతగా కుదిరినట్టు అనిపించడం లేదు. మరీ ముఖ్యంగా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అతిపెద్ద మైనస్‌లా కనిపిస్తోంది. మరి ఈ సినిమాను అక్కడి జనాలు యాక్సెప్ట్ చేస్తారో
లేదో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios