Asianet News TeluguAsianet News Telugu

బ్యాంకాక్‌ లో భారీ ఫైటింగ్ కు రెడీ అవుతున్న అల్లు అర్జున్

పుష్ప పార్ట్ 2 కోసం పక్కా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్. ముఖ్యంగా పుష్ప పార్ట్ 2 కోసం యాక్షన్ సీక్వెన్ ను భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నారట. దీని  కోసం రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్.
 

Allu Arjun Action Schedule in Bangkok
Author
First Published Nov 10, 2022, 1:59 PM IST

పుష్పమూవీ క్రియేట్ చేసిన రికార్డ్ లు అన్నీఇన్నీ కావు. తెలుగు సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మూవీతో టాలీవుడ్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా  మారిపోయాడు.  బాక్సాఫీస్ దగ్గర దాదాపు 400కోట్ల  వరకూ వసూళ్లతో బన్నీ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది సినిమా.  ఇక పుష్ప పార్ట్ 2ను అంతకు మించి చేయాలని చూస్తున్నారు టీమ్. దీని కోసం చాలా గ్యాప్ ఇచ్చి... పక్కాగా ప్రిపేర్ అవుతున్నారు. అటు పుష్ప చూసి మెస్మరైజ్ అయిన అభిమానులు పుష్ప పార్ట్ 2 కోసం ఎంతో  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇక లాస్ట్  ఆగస్ట్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ఈ నెలలోనే ఫస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసుకోబుతున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో.. తాజా సమాచారం ప్రకారం పుష్పా పార్ట్ 2 కోసం ఓ షెడ్యూల్ ను  బ్యాంకాక్‌లో ప్లాన్ చేస్తున్నారట టీమ్. అది కూడా భారీ  యాక్షన్‌ ఎపిసోడ్‌ను  అక్కడ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. 

బ్యాంకాక్ అడవుల్లో భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కించేందుకు ఇప్పటికే సుకుమార్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దాదాపు 15 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ ఉంటుందని తెలుస్తోంది.  సినిమాకు చాలా కీలకమైన షెడ్యూల్ ఇది అని తెలుస్తోంది. అందకే ఈ  షెడ్యూల్‌  విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారట టీమ్. ప్రస్తుతం ఫారెన్ టూర్ లో ఉన్న బన్నీ.. ఫ్రెష్ గా ఈ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్నాడట. 

అంతే కాదు వచ్చే నెలలో పుష్ప2  సినిమాకు సబంధించిన  ఫస్ట్‌  లుక్ టీజర్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్చేస్తున్నట్టు సమాచారం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో  ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, అనసూయ భరద్వాజ్‌ ముఖ్యపాత్రల్ని పోషి స్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ కు మ్యూజిక్ అందించి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు దేవిశ్రీ ప్రసాద్. ఇక పుష్ప 2 కోసం అంతకు మించిన మ్యూజిక్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఇక సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios