`శాకుంతలం`లో బాల నటిగా నటించిన అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కూతురిగా కనిపించబోతున్నారు. ఇదే ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సమంత మెయిన్‌ రోల్‌లో నటించిన `శాకుంతలం` చిత్రంలో బాల నటిగా నటిస్తుంది. ఇందులో బాల భరతుడి పాత్రలో అల్లు అర్హ నటిస్తుండటం విశేషం. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్‌ లవ్ స్టోరీ ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్హ ఇప్పుడు మరో సినిమాలో కనిపించబోతుందట. అది పవన్‌ కళ్యాణ్‌కి కూతురిగా కనిపించబోతుండటం విశేషం. 

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఒకటి. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌ అని తెలుస్తుంది. ఈ చిత్రం ఆ మధ్య గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది. రెగ్యూలర్‌ షూటింగ్‌కి కొంత సమయం పడుతుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ చిత్రం విజయ్‌ నటించిన `తెరి`కి రీమేక్‌గా, అలాగే హరీష్‌ శంకర్‌ రాసుకున్న `భవదీయుడు భగత్‌ సింగ్‌` కథ మేళవింపుగా రూపొందబోతుందని సమాచారం. 

`థెరి`లోని పాప, మహిళలకు సంబంధించిన సెంటిమెంట్‌ అంశాలను, భవదీయుడులోని పవర్‌ ఫుల్‌ క్యారెక్టరైజేషన్‌ని మిక్స్ చేసి `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`గా తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. అయితే `థెరి`లో విజయ్‌, సమంత ఓ పాప ఉంటుంది. అందులో నటి మీనా కూతురు నటించింది. మరి ఇప్పుడు తెలుగులో పవన్‌కి కూతురుగా ఎవరు నటిస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. 

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రంలో పవన్‌కి కూతురిగా అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హని తీసుకోబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు జరిగాయని, బన్నీ వైపు నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ లభించిందని సమాచారం. పవన్‌ సినిమాలు బాలనటిగా, పైగా ఆయన కూతురిగా అంటే ఎంతటి పేరొస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలనటిగానే స్టార్‌ ఇమేజ్‌ వచ్చినా ఆశ్చర్యం లేదు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త హాట్‌ టాపిక్ అవుతుంది. అల్లు అర్హ పవన్‌కి వరుసకి మనవరాలు అవుతుందనే విసయం తెలిసిందే.