రీసెంట్ గా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘ఆహా..’ అనే యాప్ ద్వారా ఓటీటీ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వంటి వీడియో బ్రౌజింగ్ ఛానెళ్లకు పోటీగా ఈ యాప్ ని రెడీ చేస్తున్నారు. అందులో భాగంగా వెబ్ సీరిస్ లను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఆహాలో వస్తున్న కొత్త పోరడు అనే  వెబ్ సిరీస్‌లు యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అదే పద్దతిలో  నవ్‌దీప్ హీరోగా, లక్ష్మీకాంత్ చెన్నా అనే  దర్శకుడి డైరెక్షన్‌లో ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించారు అల్లుఅరవింద్.

'రన్' అనే టైటిల్ తో ఈ  వెబ్ సిరీస్ ని రూపొందింది. నవదీప్ పూజిత పొన్నాడ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను లక్ష్మీకాంత్ చెన్నా డైరెక్ట్ చేస్తున్నాడు. త్వరలోనే రన్ సిరీస్ ఆహాలో విడుదల కానున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ఆ వెబ్ సీరిస్ ని ఆపి సినిమాగా చేద్దామని ఫిక్స్ అయ్యారట అరవింద్. రీసెంట్ గా  ఈ వెబ్ సిరీస్ చూసిన అల్లు అరవింద్... దీన్ని వెబ్ సిరీస్‌గా కంటే సినిమాగా తీస్తే మంచి బిజినెస్ అవుతుందని భావించారట.

ఆ నిర్ణయానికి రాగానే...  దర్శకుడిని దీన్ని సినిమాగా మార్చేందుకు కావల్సిన మార్పులు చేయమని కూడా చెప్పేశాడట. పాటలు కూడా పెట్టమని అడిగారట. ఇలా అంత పెద్ద ప్రొడ్యూసర్ ఊహించని విధంగా ప్రపోజల్ పెట్టడంతో ఒక్కసారిగా షాకైన ఆ దర్శకుడు, ఏం చెప్పాలో తెలియక వెబ్ సిరీస్‌ను ఎడిట్ చేసి, సినిమాగా రెడీ చేసే పనిలో బిజీ అయ్యాడట. అయితే ఇలా వెబ్ సిరీస్‌ను సినిమాగా మార్చాలనుకోవడం సరైన నిర్ణయం కాదని అంటున్నారు కొందరు నెటిజన్స్. అయితే అల్లు అరవింద్ ఓ నిర్ణయం తీసుకుంటే వెనకడగు వేసే రకం కాదుగా.