ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు అల్లు అరవింద్ ఇక సినిమాలకు దూరం కానున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పటివరకు ఎక్కువగా మెగాహీరోలతోనే ఈ బ్యానర్ లో సినిమాలు చేసుకుంటూ వచ్చారు.

ఇకపై వేరే హీరోలతో కూడా చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ నిర్మాణానికి దూరంగా ఉండాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం ఆయన చేతిలో కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ లోని కొంతమంది అగ్ర హీరోలతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఒకట్రెండు సంవత్సరాల్లో వాటన్నింటినీ పూర్తి చేసే ఇక పూర్తిగా నిర్మాణ బాధ్యతలను తన తనయులకు అప్పగించాలని చూస్తున్నారట. ఇప్పటికే గీతాఆర్ట్స్ నిర్మాణ వ్యవహారాలను చాలా వరకు బన్నీ వాసు చూసుకుంటున్నారు. ఇక నుండి అల్లు అరవింద్ పెద్ద కొడుకుతో పాటు బన్నీని కూడా ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు.